గత రెండు సంవత్సరాల కాలంగా పూరీ  జగన్నాధ్ పెద్ద హీరోలను పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. కేలవం చిన్న చిత్రాలు, చిన్న హీరోల కాంబినేషన్స్, డెబ్యూ హీరోల మూవీలు అంటూ మాత్రమే హంగామా చేస్తున్నాడు. పూరీతో పనిచేయటానికి పలువురు పెద్ద హీరోలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ పూరీ మాత్రం వారిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ఓ కమర్షియల్ ఫార్ములానే ఉందని అంటున్నారు కొందరు.


గతంలో డైరెక్టర్స్ ఎంతో కష్టపడి మూవీని తెరకెక్కిస్తే, ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా మారి హీరోకి పెద్ద పేరునే తీసుకువస్తుంది. తరువాత హీరోలు అన్ని రకాలుగా డిమాండ్స్ పెంచుకుంటూ వస్తున్నారు. కానీ డైరెక్టర్స్ పరిస్థితి వేరు. తనకు డిమాండ్ రావాలంటే అలాంటి హిట్స్ చాలా మంది హీరోలకి ఇవ్వాలి. దీంతో ఆర్ధిక పరంగా డైరెక్టర్ కంటే హీరోగారే అన్నింటిలో ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.


డైరెక్టర్స్ సైతం అర్ధికంగా ఎదుగుతున్నారు. పెద్దహీరోలు కోసం వెయిట్ చేసే ధోరణిని పూర్తిగా మానుకున్నారు. అర్ధికంగా లాభం తెచ్చి పెట్టే మూవీలతోనే ముందుకు వెళుతున్నారు. అందుకే పూరీ జగన్నాధ్ పెద్ద హీరోలతో నెలల తరబడి మూవీలను తీసి నష్టపోవటం కంటే, కలిసివచ్చే హీరోలతో మూవీలను తెరకెక్కించి లాభాలను పొందుతున్నాడు. గత కొంత కాలంగా పూరీ జగన్నాధ్ ఈ ఫార్ములానే పాటిస్తున్నాడు.  ఈ మధ్యే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌‌తో కలిసి చేసిన ‘లోఫర్’ మూవీతోనూ పూరీ బాగానే సంపాదించినట్టు టాక్స్ వినిపిస్తన్నాయి.


ఇక ఇప్పుడు ‘లోఫర్’ తర్వాత ఇషాన్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ రోగ్ అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్ళాడు.  ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ మూవీ తరువాత సైతం ఓ చిన్న హీరోతోనూ మూవీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడంట. పెద్ద హీరోల మూవీలను పూరీ పూర్తిగా వదిలేశాడా? అనే అనుమానాలు కూడ వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: