దేశ పురోగతిని మనిషి ఔదార్యంతో పోల్చితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.. దేశం నాకేమిచ్చింది.. నేను దేశానికి ఇవ్వడానికి.. అనుకుని బ్రతికే మనుషులున్న ఈ సమాజంలో మనిషికి దొరికిన ఏకైక అస్త్రం వాక్ స్వాతంత్రం.. అంటే మనకు ఇష్టమొచ్చిన మాట ఇష్టమొచ్చిన సందర్భంలో..ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడొచ్చన్నమాట. వాక్ స్వాతంత్రం అంటే ఇదేనా అనుకోవచ్చు అయితే ప్రస్తుతం దేశం మొత్తం గడ గడలాడించే కొన్ని మహోన్నత శక్తులు దీన్నే తమ అస్త్రంగా వాడుతున్నారన్నది నమ్మాల్సిన నిజం.


ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా మనిషి ఒక విషయం గురించి తన మనసులో ఉన్న మాట వాక్ స్వాతంత్రం అనే భావనలో బయట పెడితే అది కాస్త నానా యాగిరి అవుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని సంభోధించబడే ఆమీర్ ఖాన్ విషయంలో జరిగింది. అతను అన్న మాటలు అతని అభిమానించే అభిమానుల్లో కూడా విధ్వంసాలను సృష్టించే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆమీర్ ఏ కోణంలో అలా అన్నాడంటే తన భార్య దేశం గురించి, దేశ భద్రతల గురించి తన మనసులో ఉన్న మాట అతనితో అనడం జరిగింది. ఆమీర్ ఖాన్ దాన్నే కాస్త నోరు జారి దేశంలో 'అసహనం' అంటూ దుమారం లేపాడు.


నిజానికి ఆమీర్ ఖాన్ కావాలని చేసిందని కాకపోయినా దేశంలో అతని మీద జరుగుతున్న ఎదురుదాడిని చూసి మనిషికి వాక్ స్వాతంత్రం ఇచ్చింది ఇందుకేనా అని అభిప్రాయపడాల్సి వస్తుంది. దేశం అంటే గౌరం లేకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయన్నది నూటికి 90 శాతం నిజమే అయినా కొన్ని సందర్భాల్లో 10 శాతం గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అందుకే వాక్ స్వాతంత్రం అనడం దేనికి.. ఏదన్నా సున్నితమైన విషయం గురించి మాట్లాడితే ఇలా వాయించడం దేనికి.. అని అభిప్రాయపడుతున్నారు సగటు మానవుడు. అంటే పైన చెప్పిన అంశాలన్నీ ఆమీర్ ఖాన్ చేసింది సమర్ధించే విధంగా ఉన్నా ఇక్కడ మ్యాటర్ కాదు దేశం గురించి ఒక్క మనిషి తన అభిప్రాయాన్ని ఉన్నదున్నట్టు చెబితే అతని మీద దండయాత్రకు దిగుతున్నారు. దానికి కారణాలు నిజమైనవేనా లేదా అన్నది విశ్లేషించమని చెప్పే ప్రయత్నం.


ఏది ఏమైనా ఒక ప్రఖ్యాత వ్యక్తుల స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా సమాజం, దేశం గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పుడు సందేశాలు రాకుండా జాగ్రత్త పడితే మంచిది లేదంటే ఆమీర్ ఖాన్ కు జరిగిన అవమానమే అందరికి జరిగే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: