మంచు ఫ్యామిలీలో అటు హీరోగా ఇటు నిర్మాతగా సమానంగా అడుగులేస్తూ సక్సెస్ రేట్ ఎలా ఉన్నా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు మంచు విష్ణు. మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందుకున్న మొదటి తనయుడిగా ఆయన ప్రష్తానాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు ఒక స్టార్ స్టేటస్ మాత్రం సంపాధించలేకపోయాడు. అయితే చిన్నోడు మనోజ్ మాత్రం మాస్ ఇమేజ్ తో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటుచేసుకున్నాడు. మంచు మనోజ్ కేవలం హీరోగానే స్థిరపడగా విష్ణు మాత్రం తండ్రి నిర్మాత భాధ్యతలను తన మీద వేసుకున్నాడు.


ప్రస్తుతానికి తన సినిమాలు తానే నిర్మిస్తున్న విష్ణు.. ఇప్పుడిప్పుడే వేరే హీరోలతో సినిమాలు చేయడం మొదలెట్టాడు. అయితే సినిమా వేరే హీరోతో చేసినా సినిమాలో మంచు ఫ్యామిలీ ఉండటం విశేషం. ప్రస్తుతం విష్ణు నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్లో వస్తున్న సినిమా మామ మంచు అల్లుడు కంచు. అల్లరి నరేష్ కంచు అల్లుడిగా చేస్తుండగా మంచు మామగా మంచు మోహన్ బాబు చేస్తున్నారు. అయితే సినిమాలో మోహన్ బాబు క్యారక్టర్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సినిమాలో మీనా, రమ్యకృష్ణ లాంటి వారు మోహన్ బాబు సరసన నటిస్తున్నారు.


అయితే రమ్యకృష్ణ సినిమా చేయడం కోసం ఆమె రెమ్యునరేషన్ విషయంలో బేరాలాడాడట విష్ణు. సినిమాల్లో ఇలా రెమ్యునరేషన్ గురించి బార్గేనింగ్ చేసే వారిని నేనేక్కడా చూడలేదంటూ విష్ణుపై సెటైర్లు వేసింది రమ్యకృష్ణ. అయితే పారితోషికం ఒకసారి ఓకే అయ్యాక మాత్రం ఇక దానికి వందకు వంద శాతం న్యాయం చేస్తాడని చెప్పింది రమ్యకృష్ణ. బాహుబలి శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ మామ మంచు అల్లుడు కంచు సినిమాలో నటించడం సినిమాకు కూడా బాగా హెల్ప్ అయ్యే చాన్స్ ఉంది.


మరి విష్ణు మరీ అంతలా బార్గేనింగ్ చేస్తే రమ్యకృష్ణ సభాముఖంగా అంటుంది అని అనుకుంటున్నారంతా.. 24 ఫ్రేమ్స్ లో వరుసెంట సినిమాలు చేస్తున్న విష్ణు ఇలానే అందరిని రెమ్యునరేషన్ విషయంలో బార్గేనింగ్ చేసి తీసుకుంటాడా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. నవ్వుతూ అన్నా సరే మంచు ఫ్యామిలీకి రమ్యకృష్ణ మంచి చురకలు అంటించిందని అందరు అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: