ఇండస్ట్రీలో సెలబ్రెటీలే కాదు వారి బంధువులు కూడా సొసైటీలో తమ ప్రత్యేకతలు అప్పుడప్పుడూ చాటుకుంటారు..తమకు ఎదురే లేదని తామంటే అందరూ గౌరవించాలని లేదంట తాట తీస్తామంటారు. గతంలో సినిమా ఇండస్ట్రీలో వాళ్లు రోడ్డుపై తమ ప్రతాపాలు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇక తమ వాహనాలకు ఎవరైనా అడ్డు పెట్టినా చిన్న పాటి యాక్సిడెంట్ చేసినా వారిపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతారు. అంతేందుకు డ్రంక్ అండ డ్రైవ్ లో పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి.



ఆ మద్య రాంచరణ్ కారుకి యాక్సిడెంట్ చేశారని ఆయన అంగరక్షకులు ఇద్దరు ఐటీ ప్రఫెషనల్స్ ని చితక్కొట్టారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు..దగ్గబాటి రానా తమ్ముడు అయిన అభిరామ్ జూబ్లీహిల్స్ రోడ్డు లో ఇద్దరు విదేశీయుల పై వీరంగం సృష్టించి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. తమ కారును ఢీకొన్న వ్యక్తులపై అతడు దాడికి దిగాడు. కారును ఢీకొట్టిన వ్యక్తులపై భౌతికంగా దాడి చేసినట్లు తెలిసింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.  


దగ్గుబాటి రానా, అభిరామ్


సీసీటీవీ ఫుటేజి లో రికార్డయిన ప్రకారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో బైక్ పై వచ్చిన ఇద్దరు విదేశీయులు అభిరామ్ వస్తున్న కారు ముందుభాగానికి కొంచెం తగిలించారు. అక్కడ నుంచి వాళ్లు వెళుతుంటే అభిరామ్ కారుదిగి వారిని వెంబడించి వారిపై దాడికి దిగాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు తప్పు ఎవరిదనే విషయంపై పరిశీలన చేస్తున్నారు. ముందు ఎవరు దాడి చేశారు అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీల వారసులు రోడ్డుపై వీరంగం చేయడం కొత్తేమీ కాకపోయినా వారి కుటుంబాలకు మాత్రం ఇలాంటి సంఘటనలు తలనొప్పులుగా తయారవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: