ప్రిన్స్ మహేష్ బాబుకు తన కుటుంబం అన్నా తన భార్య పిల్లలు అన్నా విపరీతమైన ప్రేమ. దీనితో తన పిల్లలు గౌతమ్ సితారలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు మహేష్. అయితే ప్రస్తుతం గౌతమ్ టార్చర్ ను తాను తట్టుకోలేక పోతున్నాను అంటూ ఒక ఆ శక్తికర విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు మహేష్. 

టాప్ హీరో స్థాయికి ఎదిగిన తనకు తన చిన్నతనంలో నటన పై అంత ఆశక్తి ఉండేది కాదని అయితే తన తండ్రి పట్టుపట్టడంతో తాను తన చిన్నతనంలో తన సోదరుడు రమేష్ తో కలిసి సినిమాలు రెండు మూడు చేసాక తనకు సినిమాల పై ఆ శక్తి కలిగిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు మహేష్. అయితే గౌతమ్ పరిస్థితి వేరట. 

తన కొడుకు గౌతమ్ కు సినిమాల పై రోజురోజుకు పెరుగుతున్న అభిమానాన్ని గ్రహించి తాను గౌతమ్ ని  ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో నటింప చేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ సినిమాలోని  గౌతమ్ నటనకు మా టీవీ అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డుకోసం తన కొడుకు ఇంట్లో సపరేట్ గా ఒక ర్యాక్ ని ఏర్పాటు చేసుకొని దాంట్లో పెట్టుకుని రోజు చూసుకుంటాడని కామెంట్ చేసాడు మహేష్. అంతేకాదు ప్రతిరోజు ‘మీ కొత్త సినిమాలో నాకేమైనా రోల్ ఉందా’ అని అడుగుతూ తనను టార్చర్ పెడతాడని నవ్వుతూ చెప్పాడు మహేష్. 

అయితే తన కొత్త సినిమాలో గౌతమ్ కు సంబంధించి రోల్ ఉన్నది లేనిది తనకు తెలియదు అని దర్శకుడుని అడగాలని తాను అంటే ఆ దర్శకుడితో ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా ? అని ఎదురు ప్రశ్నలు వేసే తన కొడుకును చూస్తూ ఉంటే నిజంగా నటన పై అభిమానమా ? లేకుంటే స్కూల్ తప్పించుకోవడానికి ఇలా అడుగుతున్నాడా ? అన్న సందేహం కలుగుతోంది అని కామెంట్స్ చేసాడు మహేష్. అయితే తన పిల్లల విషయంలో తాను ఒక స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి వారు ఎలా కోరుకుంటే అలా వాళ్ళను మారుస్తాను అంటూ గౌతమ్ రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ అన్న సంకేతాలు ఇచ్చాడు ప్రిన్స్ మహేష్..



మరింత సమాచారం తెలుసుకోండి: