హీరోయిన్ సీనియర్ శ్రీదేవంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎంత పిచ్చో అందరికీ తెలుసు. తన శ్రీదేవి పిచ్చిని దాచుకోవడానకి వర్మ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంతేకాదు.. అవకాశం దొరికిన ప్రతిసారీ శ్రీదేవిని ఆకాశానికెత్తేయడం వర్మ ప్రత్యేకత. తాను శ్రీదేవి కాలంలో పుట్టనందుకు చాలా ఫీలవుతానని వర్మ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 

అందుకే లేటుగానైనా సరే శ్రీదేవికి తన సినిమాల్లో అవకాశం కల్పించాడు వర్మ. గోవిందా గోవింద, క్షణ క్షణం వంటి తన తొలినాటి చిత్రాల్లో తన సౌందర్య దేవతనే హీరోయిన్ గా తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు.. అప్పటికే ముదిరిపోయిన శ్రీదేవిని కూడా గ్లామరస్ గా చూపించాడు వర్మ. ఇప్పుడు లేటెస్టుగా వర్మ గన్స్ అండ్ థైస్ అనే పుస్తకం రాస్తున్న సంగతి తెలిసిందే. 

ఆ పుస్తకంలో తన శ్రీదేవి పిచ్చిని మరింత డిటైల్డ్ రాశాడట వర్మ. ఆ విషయం ఆయనే బయటపెట్టారు. ఆ పుస్తకంలో శ్రీదేవి కోసం ఏకంగా ఓ చాప్టరే కేటాయించాడట రామ్ గోపాల్ వర్మ. ఆ చాప్టర్ ఓ వ్యాసంలా కాకుండా ఓ ప్రేమలేఖ తరహాలో ఉంటుందట. తాను అందాల దేవతగా పూజించే శ్రీదేవి భర్తపై కూడా వర్మ ఘాటు కామెంట్లే చేశాడు. తన సౌందర్య రాశిని వంటింటికి తెచ్చుకున్న శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను ఎప్పటికీ తాను క్షమించలేనంటున్నాడు వర్మ. 

ఎంతైనా శ్రీదేవి వివాహిత. పెళ్లైన హీరోయిన్ పై ఇలాంటి కామెంట్లేంటని కొందరు విసుక్కుంటున్నారు. అభిమానం, ఆరాధన వరకూ ఓకే.. కానీ ప్రేమలేఖలా రాస్తా.. ఆమె మొగుడ్ని క్షమించలేను అంటూ కామెంట్లు చేయడం లక్ష్మణ రేఖ దాటటమే అంటున్నారు. అయినా వర్మ ఇలాంటి విమర్శలను ఎప్పుడు లెక్క చేశాడని.. ప్రతి వ్యక్తీ ఎవరో ఒకరిపై మోజు పడతారని.. ఆ ఇష్టం మత్తుమందులాంటిదనీ తన ఇష్టాన్ని సమర్థించుకుంటున్నారు వర్మ. దటీజ్ వర్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: