టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ ఇద్దరు ప్రేమలో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. హీరోయిన్స్ ప్రేమించుకోవడం ఏంటని కాస్త ఆశ్చర్యపడవచ్చు. విషయం ఏంటంటే టాలీవుడ్ హీరోలకు సరిసమాన క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క తను చేసే రిస్కులను చూసి హీరోలను ఎలాగు తన బుట్టలో వేసుకుంది కాని ఇప్పుడు హీరోయిన్స్ ని కూడా తన మాయలో పడేస్తుంది. విషయం అర్ధమవ్వాలంటే ఇంకాస్త డీప్ గా వెళ్లాల్సిందే. మొన్నటిదాకా రుద్రమదేవి వీరనారి సాహసాలు చేసిన అనుష్క ఇప్పుడు ఒబెసిటీ ప్రాబ్లెం ఉన్న బొద్దుగుమ్మలా సైజ్ జీరో సినిమాలో లావుగా కనిపించి షాక్ ఇచ్చింది.


లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ సినిమాగా నిలిచినా అనుష్క నటనకు అందరు మంత్రముగ్ధులు అవుతున్నారు. సినిమా చూసిన హీరోయిన్స్ అయితే అనుష్కని లవ్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ దారిలోనే హాట్ గాళ్ రకుల్ ప్రీత్ సింగ్ 'ఐ యాం ఇన్ లవ్ విత్ స్వీటీ అనుష్క' అంటూ ట్వీట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రకుల్ అనుష్కని ప్రేమించడం కాస్త విచిత్రంగానే ఉన్నా సినిమా కోసం అనుష్క అంత రిస్క్ తీసుకుని వెయిట్ పెరగడం సినిమా మీద తనకున్న ప్యాషన్ ని తెలియచేస్తుంది.


సైజ్ జీరో సినిమాలో అనుష్క :


అందుకే సైజ్ జీరో సినిమా చూసి స్వీటీకి ఫ్యాన్స్ అయ్యింది రకుల్. ఆ విధానంలోనే తనని ప్రేమిస్తున్నా అంటూ కామెంట్స్ చేస్తుంది. నిజంగా సినిమా కోసం ఎంతటి రిస్క్ నైనా తీసుకుని చేసే అనుష్కకు ఒక్క రకుల్ ఏంటి చెప్పండి అందరు హీరోయిన్స్ ప్రేమించడం జరుగుతుంది. సినిమా అనేది ఏదో సరదాగా చేశాం అని కాకుండా ఎలాంటి సినిమానైనా పాత్ర నైనా ఇట్టే చేసి చూపిస్తుంది అనుష్క. ప్రస్తుతం సైజ్ జీరో హవామీదున అనుష్క త్వరలో బాహుబలి సెకండ్ పార్ట్ లో నటించేందుకు రెడీ అయ్యింది.


ఇదే గాక సింగం-3 లో కూడా సూర్య సరసన నటించేందుకు రెడీ అయ్యింది. ఒక హీరోయిన్ ఇంకో హీరోయిన్ని సినిమా గురించి పొగడటం కాస్త ఆశ్చర్యమే అయినా సైజ్ జీరో కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ కి అనుష్కని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. సినిమా చరిత్రలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని ఏర్పాటుచేసుకునేందుకు అమ్మడు చేస్తున్న సాహాసాలు ఖచ్చితంగా మెచ్చుకోదగ్గవే అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: