తెలుగు చిత్ర పరిశ్రమలోకి శేఖర్ ఖమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’ చిత్రంలో మెరుపులా మెరిసింది మిల్కీబ్యూటీ తమన్నా. తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోయినా..భద్రినాథ్, రచ్చ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారు మతులు పోగుడుతున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. ఇక పోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అవంతిక పాత్రలో అందాల దేవతలా దర్శనమిచ్చింది. 

తాజాగా ఈ అమ్మడు కొందరు హీరోలపై సంచలన కామెంట్ చేసింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చూసిన వెంటనే ఆయన ఫ్యాన్ అయిపోయిందట..అంతే కాదు ఆ హీరో ఈ అమ్మడికి తెగ నచ్చాడట. కాకపోతే ఇప్పటి వరకు ఆయనను మాత్రం కలవలేదట. హృతిక్ తో కలిసి పనిచేయాలన్న తన కల వాస్తవ రూపం దాల్చాలని ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఎప్పటికైనా హృతిక్ సరసన నటించాలని ఆమె కోరుకుంటుందని చెప్పింది.

మిల్కీ బ్యూటీ తమన్నా


అయితే తెలుగు హీరోల్లో ప్రభాస్ ని డార్లింగ్ అని, రానాని హల్క్ అని పిలుస్తుందట. ఇక రవితేజ అయితే తనతో చాలా జాలీగా మాట్లాడుతాడని అతనితో మాట్లాడుతుంటే టైం తెలియదని అంటుంది.  జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ ముగ్గురూ అద్భుతమైన డ్యాన్స్ చేస్తారని అంటుంది. నాగార్జున అయితే తన కళ్లతో కట్టి పడేస్తారని చెబుతుంది. రజినీకాంత్ సరసన ఎప్పటికైనా నటించాలని కోరిక ఉందని అంటుంది ఈ మిల్కీ బ్యూటి తమన్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: