సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2015కి ప్రత్యేకం ఏమిటంటే అది బాహుబలి మూవీనే అని చెప్పాలి. అంతలా ఈ మూవీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్ లను తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం టాలీవుడ్ లో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సినిమాలుగా బాహుబలి, శ్రీమంతుడు లిస్ట్ లో నిలిచాయి. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు సాధించే మూవీ ఒక్కటైనా ఉంటుందా? అంటూ ఎదురుచూసే ప్రేక్షకులకి...ఈ రెండు మూవీలు ఆ వెలితిని తీర్చాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐఫా ఫిల్మ్ ఫెస్టివల్ సందడిని క్రియేట్ చేస్తుంది. ఈ ఫెస్టివల్ లో బాహుబలి, శ్రీమంతుడు మూవీల మధ్య పోటీలు జరుగుతున్నారు. డిసెంబర్ మొదట్లో దుబాయ్ లో జరగనున్న ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ లో బాహుబలి సినిమా 14 విభాగాల్లో నామినేట్ అయింది. అలాగే శ్రీమంతుడు సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఇక 14 విభాల్లో నామినేట్ అయిన బాహుబలికి కచ్ఛితంగా 10 కి మించిన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.


ఇక ఈ నామినేషన్స్ కి సంబంధించిన వివరాలు:

బెస్ట్ పిక్చర్ – బాహుబలి

బెస్ట్ హీరో – ప్రభాస్

బెస్ట్ హీరోయిన్ – తమన్నా

బెస్ట్ నెగటివ్ రోల్ – రానా దగ్గుబాటి

బెస్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ రాజమౌళి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎం కీరవాణి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్) – రమ్యకృష్ణ

బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్) – సత్య రాజ్

బెస్ట్ లిరిక్స్ – కె. శివదత్తా

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – రేవంత్ మరియు దీపు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్) – సత్య యామిని, గీత మాధురి, దామిని

ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ లో శ్రీమంతుడు నామినేట్ అయిన 11విభాగాల వివరాలు :

బెస్ట్ పిక్చర్ – శ్రీమంతుడు

బెస్ట్ హీరో – మహేష్ బాబు

బెస్ట్ హీరోయిన్ – శృతి హాసన్

బెస్ట్ నెగటివ్ రోల్ – సంపత్ రాజ్

బెస్ట్ డైరెక్టర్ – కొరటాల శివ

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవీశ్రీ ప్రసాద్

బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్) – తులసి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్) – జగపతిబాబు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – శాస్త్రీ సాగర్


మరింత సమాచారం తెలుసుకోండి: