టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రియల్ లైఫ్ లో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయంటూ, అతన్ని దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతుంటారంట. అయితే ఈ విషయాలను ఎవ్వరు పెద్దగా పట్టించుకోరంట. తాజాగా తను తన రియల్ లైప్ పై ఓ లీడింగ్ ఇంగ్లీష్ టాబ్లాయిడ్ కి ఇంటర్వూ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కొన్ని విషయాలు నమ్మలేనట్టుగా ఉన్నాయంటూ ప్రముఖ హీరోయిన్ కామెంట్ చేయటం మరింత సంచలనంగా మారింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు అంటే టాలీవుడ్ కి ప్రత్యేకం. ఇక అమ్మాయిల మనస్సులకి మరింత ప్రత్యేకం. అలాంటి మహేష్ బాబు గురించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇప్పటి వరకూ మహేష్ బాబు ఫిల్మ్ కెరీర్ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్న ప్రేక్షకులు, తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అతి తక్కువ విషయాలే తెలుసు. ఎప్పుడు పర్సనల్ మేటర్స్ ని మహేష్ బాబు బయటకు రానివ్వడు.


కానీ ఈసారి మాత్రం ఓపెన్ అయ్యాడు. ఇంటర్వూలో వివరాలను చూస్తే,‘సింపుల్ గా జీవించంటం, స్టార్ అనే విషయాన్ని ఇంటి బయటే వదిలేసి రావటం వంటివి మా నాన్నగారు నుంచే నేర్చుకున్నాను. అలాగే నా 10ఏళ్ళ వివాహ బంధంలో నమ్రతకి ఓ మంచి భర్తలా ఉన్నాను. చాలా మంది తమ భార్యలతో సరిగా ఉండరు. ఎవరైతే భార్యలకి నమ్మకమైన భర్తల్లా ఉండరో వాళ్ళు ఫూలిష్ పర్సన్స్ అని అంటాను. నా మారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.’ అంటూ కామెంట్ చేశాడు.


అయితే ఈ వార్తలపై తమన్న, మహేష్ పై కామెంట్ చేసింది. ‘మహేష్ ఇంటర్వూ సో గుడ్. అయితే నటుడుగా మహేష్ మంచి యాక్టర్. సినీ లైఫ్ లో ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటిని బయటకు చెప్పలేము. కానీ, మహేష్ చెప్పినవన్నీ పైకి నిజాలు అనే భావిస్తున్నాను’అంటూ కామెంట్ చేసింది. కోలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ రావటంతో.. మహేష్ పై తమన్న చేసిన కామెంట్స్ హాట్ టాక్స్ గా మారింది. తమన్న మాట్లాడిన దాంట్లో మహేష్ నిజం చెప్పాడనా? చెప్పలేదనా? అంటూ కొందరికి అనుమానాలు ఏర్పడేలా ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: