ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 21 క్రాప్ట్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తేనే మూవీ మంచి రిజల్ట్ ని అందకుంటుంది. ఇందులో ఏ ఒక్కరూ సరిగా పనిచేయకపోయినా సరే, ఆ ఎఫెక్ట్ సినిమాపై కచ్ఛితంగా ప్రభావితం చూపుతుంది. ప్రస్తతం మూవీలో ఎవరెవరు ఎంతలా కష్టపడ్డారు అనేది ప్రేక్షకులు స్వయంగా తెలుసుకుంటున్నారు.  అలాగే టెక్నిషియన్ కి గుర్తింపు ఇవ్వకపోతే కచ్ఛితంగా ఫైట్ చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో మూవీ విషయంలో, టెక్నిషన్స్ కి విలువ ఇవ్వనుందుకు మూవీలో భారీ మార్పులే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తమిళ హీరో సూర్య నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ సింగం3. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీకి మంచి ఆధరణ ఉంది. సింగం సినిమాకి వరుస సీక్వెల్స్ చేయటంతో సూర్య మార్కెట్ సైతం పెరుగుతూ వస్తుంది. సింగం, సింగం2 సినిమాలు పెద్ద హిట్ కావటంతో, తాజాగా సింగం సీరీస్ కి మూడవ పార్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే మొదటి రెండు పార్ట్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


కానీ మూడవ పార్ట్ కి దేవిశ్రీ దూరం అయ్యాడు. మొదట సింగం3కి గ్రీన్ సిగ్నల్ ఇచ్నిన దేవిశ్రీ, డైరెక్టర్ ఓవర్ కమాండ్ వల్ల దాని నుండి తప్పుకున్నట్టుగా కోలీవుడ్ నుండి వినిపిస్తున్న సమాచారం. తరువాత సీన్ లోకి అనిరుధ్ రవిచంద్రన్ ని తీసుకోవాలని ప్రయత్నించారు. అనిరుధ్ కి సైతం డైరెక్టర్ ఓవర్ కమాండ్ అనేది నచ్ఛక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇక ఫైనల్ గా హారీష్ జైరాజ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు.


ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎందుకు మార్చారో అంటూ అసలు విషయం తెలుసుకున్న హరీష్, తన రెమ్యునరేషన్ ని డబుల్ చేసి...అందుకు ఒప్పుకుంటేనే చేస్తాను అంటూ క్లియర్ గా చెప్పుకొచ్చాడంట.  దీంతో హరీష్ కి భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా డైరెక్టర్ ఓవర్ కమాండ్ కారణంగా కోటిన్నర రూపాయలు అధనంగా హరీష్ కి సమర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇక డిసెంబర్ 2 నుంచి మొదలు కాబోతున్న ఈ సినిమా షూటింగ్, ఫస్ట్ మేజర్ షెడ్యూల్ ని వైజాగ్ లో మొదలు పెట్టనున్నారు. సుమారు 30 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: