జీవితంలో పెళ్లి అనేది అనివార్యమని రెండు కుటుంబాలను ఒక్కటి చేసేదే వివాహబంధమని భారత దేశంలో ఎంతో పవిత్రమైనదని అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక భర్తల గురించి కూడా కాస్త ఘాటుగా కామెంట్ చేశారు. కట్టుకున్న భార్యకు విలువ, గౌరవం ఇవ్వాలి అలాంటి వారే జీవితంలో అన్ని వొడిదుడుకులు తట్టుకుంటారు. అంతే కానీ భార్య మాట పట్టించుకోకుండా ఆమె మాటలకు విలువ ఇవ్వకుండా వాళ్లకు విధేయులుగా ఉండని భర్తలు ఫూల్స్ అని సంచలన కామెంట్ చేశాడు.

తాను కూడా తన కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తానని భార్య, పిల్లలు సంసారం అన్న తర్వాత అన్నీ పట్టించుకోవాలి కదా అంటున్నాడు ప్రిన్. అయితే ఈ బాధ్యతలు అన్నీ తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నట్లు ఇక తన బాగోగులన్నీ తన అన్నయ్య రమేష్ బాబు చూస్తుంటాడని అదే విధంగా తాను కూడా అంతే గౌరవంగా ప్రేమతో కుటుంబ సభ్యులతో ఉంటానని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.


మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో


ఓ జాతీయ దినపత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి తన కుటుంబం గురించి పలు విషయాలు వెల్లడించాడు మహేష్. అయితే హీరోలందరికీ హీరోయిన్లతో ఎఫైర్లు ఉంటాయనుకోవడం తప్పని తన సినిమాల్లో హీరోయిన్లతో ఎంత క్లోజ్ గా మూవ్ అయినా సినిమా షూటింగ్ పూర్తియిన తర్వాత వాళ్లను ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఇక ఇంటి బాధ్యతలన్నీ తన భార్య నమ్రత పట్టించుకుంటుందని పిల్లలు గౌతమ్, తార తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: