తెలుగు ఇండస్ట్రీలోకి గ్లామర్ క్విన్ గా అడుగు పెట్టిన అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెం.1 పొజీషన్లోకి వచ్చింది. తెగులు, తమిళ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తున్న అనుష్క గత కొంత కాలం నుంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఔరా అనిపిస్తుంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తాజాగా సైజ్ జీరో చిత్రంలో విభిన్న తరహా పాత్రలు పోషించింది. అయితే సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క 20 కిలోల బరువు పెరిగింది.  


ఇప్పుడు అనుష్క తర్వాత సినిమాల కోసం సన్నబడటానికి నానా తంలాలు పడుతుంది. వాస్తవానికి యోగా టీచర్ అయిన అనుష్క మళ్లీ యోగా జపం చేస్తుంది.  తాజాగా అనుష్కకు హీరో రానా గురువయ్యాడు..అదేంటా అనుకుంటున్నారా..నిజమేనండీ అనుష్కకు జిమ్ లో వ్యాయామ శిక్షకుడిగా భల్లాల దేవ రానా గురువు అవతారం ఎత్తాడు.  ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని మెలకువలు నేర్పుతానంటూ అనుష్క, ప్రకాశ్‌ కోవెలమూడి, కనికలతో వివిధ రకాల వ్యాయామాలు చేయించారు.

సైజ్ జీరో చిత్రలో అనుష్క


ఇప్పుడు దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సైజ్‌ జీరో అంటే సన్నగా ఉండిపోవడం కాదు, సౌకర్యవంతంగా ఉండాలి. అందుకోసం కాస్తంత ఒంటికి శ్రమ ఇవ్వాల్సిందే అంటున్నాడు జిమ్ శిక్షకుడిగా రానా. 


మరింత సమాచారం తెలుసుకోండి: