తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లలో రకూల్ ప్రితి సింగ్, రాశీఖన్నా, రెజీనా లాంటి అందాల భామలు దూసుకువెళ్తున్నారు. ఇందులో రాశీఖన్నా బొద్దుగా ముద్దగా ఉన్నా ఈ అమ్మడి గ్లామర్ కి హీరోలు ఫిదా అయిపోతున్నారు. ఇక అందంతో పాటు హావభావాలు కూడా బాగుండటంతో రాజీఖన్నా అగ్ర హీరోల సరసన చాన్సులు వస్తున్నాయి. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయికగా నటించింది.

2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫె లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత మనం చిత్రంలో అతిధి పాత్ర వేసింది. ఇక మాస్ మహరాజు రవితేజ ‘బెంగాళ్ టైగర్ ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

రాశీఖన్నా


ఈ రోజు రాశీఖన్నా పుట్టిన రోజు ఈ సందర్భంగా అప్ కమింగ్ హీరోలు సాయిధరమ్ తేజ,వరుణ్ తేజ,రవితేజ,రామ్, సందీప్ కిషన్, అల్లు శిరిష్, రకూల్ ప్రితి సింగ్ లతో తన పుట్టిన రోజు సెలబ్రేషన్ చేసుకుంది. ఈ ఫోటో తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఏపీహెరాల్డ్.కామ్ తరుపునుంచి రాశీఖన్నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: