తెలుగు చిత్ర పరిశ్రమలోకి బూతు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఆ రూమర్ నుంచి బయట పడటానికి ‘ప్రేమకథా చిత్రం’ అనే సినిమా హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో తీశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చింది. అప్పటి నుంచి కామెడీ దర్శకుడిగా పేరు తెచ్చున్న మారుతి రీసెంట్ గా నానీ హీరోగా భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని తీశారు. మతిమరుపు ఉన్న ఓ యువకుడు సంఘంలో ఎన్ని బాధలు పడుతాడు అన్న అంశంతో కామెడీ ఓరియెంటెడ్ చిత్రంగా అద్భుతంగా తీశారు.

చిన్న బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్ సంతోషంలో ముగిని తేలారు. ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్ లతో బాధపడుతున్న నానీ ఒక్కసారి మంచి హిట్ అందుకున్నాడు. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టాప్ హీరోలకు  సైతం కళ్ళు బైర్లు కమ్మేలా చేసాడు నాని.  


 భలే భలే మగాడివోయ్ పోస్టర్


ఏరియా వైజ్ గా సాధించిన కలెక్షన్ల వివరాలు : 


జాం - 7 కోట్ల 10 లక్షల షేర్ 

సీడెడ్ - 2 కోట్ల 10 లక్షల షేర్ 

ఉత్తరాంధ్ర - 2 కోట్ల 15 లక్షల షేర్ 

ఈస్ట్ గోదావరి - 1 కోటి 55 లక్షల షేర్ 

వెస్ట్ గోదావరి - 1 కోటి 5 లక్షల షేర్ 

కృష్ణా - 1 కోటి 30 లక్షల షేర్ 

గుంటూరు - 1 కోటి 65 లక్షల షేర్ 

నెల్లూరు - 50 లక్షల షేర్ 

కర్ణాటక - 2 కోట్ల 75 లక్షల షేర్ 

ఓవర్సీస్ - 6 కోట్ల 11 లక్షల షేర్ 

రెస్ట్ ఆఫ్ ఇండియా - 85 లక్షల షేర్ 

మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల 11 లక్షల షేర్ ని అసలు సిసలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది .



మరింత సమాచారం తెలుసుకోండి: