కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మీద అటు రాజకీయ నాయకులు సిని ప్రముఖులు వీరంగం ఆడటం తెలిసిన విషయమే. దేశంలో అసహనం గురించి తనదైన రీతిలో స్పదించడమే అమీర్ ఖాన్ చేసిన తప్పు. అసహనం అనే మాట ఎంత దుమారం రేపుతుందని ఊహించని అమీర్ ఖాన్ దానికి తగిన మూల్యాన్ని చెల్లిచుకుంటున్నాడు. అయితే ఆమీర్ ఖాన్ కు ఇటు వర్మ నుండి అనుపం కేర్ వరకు నిరసనల వెల్లువ మొదలైంది. కొంతమందైతే అమీర్ ని చెంప చెళ్లుమంచిపించేలా కొడితే లక్ష రొప్పాయలు అంటూ ప్రచారం కూడా చేశారు.


అయితే ఇదంతా గమనించిన పూరి జగనాథ్ తందైన మాటలతో అదరిని అవాక్కయ్యేలా చేశాడు. అమీర్ ఖాన్ అన్న మాటల్లో నాకు వేరే అర్ధం కనిపిస్తుందని.. అతన్ని అందరు తప్పుగా ఆలోచిస్తున్నారని అన్నాడు. అంతేకాదు అమీర్ గురించి గొడవ చేసేవారంతా ఫూల్స్ అంటూ మరో వివాదానికి తెరలేపాడు పూరి. అసలే పూరికి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ అని పేరుంది. అలాంటి డైరక్టర్ ఇలాంటి మాటలే మాట్లాడుతాడని ఊహిచినా అమీర్ ని తిట్టిన వారిని ఫూల్స్ అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అమీర్ ఓ ఉగ్రవాది అయి ఉండుంటే  ఇంత డేర్ గా అతన్ని దూశించేవారా అని ప్రశ్నిస్తున్నాడు పూరి.


ప్రస్తుతం లోక్ సభలో కూడా దేశంలో అసహనం గురించి వాడి వేడి చర్చలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం రాజకీయ పరిణామాల దృష్టా అమీర్ మాట్లాడింది చిచ్చు పెట్టేందుకే అన్నట్టు ఉంది. అయితే అమీర్ ఖాన్ సినిమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రతి సినిమాల్లో ఎంతో గొప్ప విషయం ఉండేలా చూసుకునే ఆమీర్ ఖాన్ సినిమాల ద్వారా ఎన్నో విషయాలను ప్రేక్షకులకు తెలియపరిచాడు. అంతేకాదు అమీర్ సినిమా అంటె కచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం ఉంటుందని భావించే వారు.


అయితే అమీర్ అలా మాట్లాడటం వల్ల తనని హోస్ట్ గా ఉంచిన సదరు దేశవాళి కంపెనీలు ఆ హీరోని తీసేయగా మిగతా వాటినుండి కూడా అమీర్ ని తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారట. అయితే పూరి సడెన్ గా అమీర్ కు సపోర్ట్ చేయడం మరో గొవడకు ఊతమిచ్చినట్టే అనిపిస్తుంది. మరి ఈ విషయం ఎందాకా వెళ్తుందో తెలియదు కాని ఆమీర్ మాత్రం నోరు జారి పెద్ద పొరపాటే చేశాడని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: