భారతదేశంలో అసహనం పెరిగి పోతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్ ను సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు రాజకీయ నాయకుల నుండి మీడియా సంస్థల వరకు టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమీర్ ఖాన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుండా ఆ వ్యాఖ్యలకు ఇంకా తాను కట్టుబడి ఉన్నాను అని చెప్పిన మాటలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. 

తాత్కాలికంగా ఈ రగడ నుండి దూరం అవ్వాలని అమీర్ ఖాన్ తాను నటిస్తున్న ‘డంగల్’ సినిమా షూటింగ్ కోసం అమెరికాకు వెళ్ళిపోయినా అమీర్ ఖాన్ కు మరో ఊహించని షాక్ తగిలింది అనే వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం అమీర్ ఖాన్ చేస్తున్న అనేక ప్రతిష్టాత్మకమైన పలు కార్పోరేట్ సంస్థల యాడ్స్ లో అమీర్ ఖాన్ ను తొలిగించి ఆ కాంట్రాక్ట్ మహేష్ బాబుకు ఇచ్చే ఆలోచనలలో చాల కార్పోరేట్ సంస్థలు ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు ‘క్లౌడ్ 9’ లాంటి ప్రముఖ మొబైల్ బ్రాండ్ కు బ్రాండ్ ఎండార్సర్ గా పనిచేస్తున్న నేపధ్యంలో దీనితో పాటు కొన్ని జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ పబ్లిసిటీకి అమీర్ ఖాన్ కంటే మహేష్ క్రేజ్ బాగుంటుంది అన్న అంచనాలకు వచ్చినట్లు తెలుస్తోంది.ఒక బాలీవుడ్ టాప్ హీరోను ఒక దక్షిణాది టాప్ యంగ్ హీరో ఇలా యాడ్స్ విషయంలో రీ ప్లేస్ చేయడం సంచలనం అని అంటున్నారు.

మహేష్ తాను త్వరలో నటించబోతున్న మురగదాస్ సినిమాకు ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరో తీసుకొని భారీ పారితోషికం తీసుకుంటున్నాడు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఏకంగా అమీర్ ఖాన్ యాడ్స్ మహేష్ ను చేరుకోవడం ఊహించని విధంగా పరుగుపెడుతున్న మహేష్ అదృష్టానికి సంకేతం. బాలీవుడ్ సినిమాలలో నటించక పోయినా బాలీవుడ్ టాప్ హీరో అమీర్ చేసిన యాడ్స్ ను ఎండార్స్ చేయడం మహేష్ స్టామినాకు నిదర్శనం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: