అఖిల్’ సినిమా ఘోర పరాజయం చెందినా హీరో అఖిల్ కు రాయబారి పదవి త్వరలో వరించ బోతోంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని పెద్దగా కష్ట పడకుండానే అఖిల్ అందుకుంటున్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం అఖిల్ నటంచబోయే రెండవ సినిమా టైటిల్ రాయబారిగా నిర్ణయించారు అని టాక్. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ అఖిల్ ను రాయబారిగా చూపిస్తాడట. 

గత కొద్ది రోజుల క్రితం క్రిష్ ఫిలిం చాంబర్ లో రాయబారి అన్న టైటిల్ రిజిస్టర్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. అఖిల్ రెండవ సినిమాకు త్రివిక్రమ్ ను దర్శకత్వం చేయమని నాగార్జున స్వయంగా కోరినా త్రివిక్రమ్ ఆలోచనలు కోలీవుడ్ టాప్ హీరో సూర్య చుట్టూ ఉండటంతో ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ కోసం క్రిష్ రంగంలోకి దిగాడు అని అంటున్నారు.

ఇప్పటికే వరుణ్ తేజ్ తో ‘కంచె’ తీసి ప్రశంసలతో పాటు విజయాన్ని కూడ అందుకున్న క్రిష్ రిజిస్టర్ చేసిన ‘రాయబారి’ టైటిల్ విలక్షణంగా ఉండటమే కాకుండా అఖిల్ ను ప్రేమ ‘రాయబారి’ గా చూపెడతాడా ? లేదంటే శాంతికి రాయబారిగా చూపెడతాడా అన్న విషయం పై సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది. ఈమధ్య కాలంలో ప్రేక్షకులు రొటీన్ కథలను కాకుండా వెరైటీ కథలను కోరుకుంటున్న నేపధ్యంలో క్రిష్ అఖిల్ తో ఇలాంటి టైటిల్ పెట్టి ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి.

అయితే ఈసినిమాను స్వయంగా క్రిష్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తాడా ? లేదంటే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తాడా అన్న విషయం పై రకరకాల కథనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక మాస్ సినిమా ప్రయోగం చేసి ఘోరంగా పరాజయం చెందిన అఖిల్ తన రూట్ మార్చి క్రిష్ తో చేయబోతున్న ఈ ప్రయోగం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: