సినిమా సెలెబ్రెటీల పై గాసిప్పులు ప్రచురించడం మీడియాకు ఎప్పటి నుంచో అలవాటైన విషయమే అయినా మిల్కీ బ్యూటీ తమన్నాను అసలు ఇంటర్వ్యూనే చేయకుండా ఆమె మాట్లాడింది అని చెపుతూ అనేక వివాదాస్పద విషయాలను ఆమె హాట్ ఫోటో షూట్ ను ప్రచురించిన కోలీవుడ్ సినిమా పత్రిక చేసిన సాహసం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం కోలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘కుముదం’ పత్రిక తమన్నా గురించి చేసిన ఫేక్ ఇంటర్వ్యూ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపం వచ్చి తనను సంప్రదించకుండానే తమిళ పత్రిక కుముదం తన ఇంటర్వ్యూను ప్రచురించిందంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాదు ఇలాంటి ఫేక్ ఇంటర్వ్యూలను ఆపే విషయంలో తాను అలసిపోయినట్లు చెప్పుకుంటోంది.

ఈ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పినట్లుగా వస్తున్న పలు కామెంట్స్ చాల వివాదాస్పదంగా మారాయి. దీనికితోడు ఆ ఇంటర్వ్యూలో తమన్నా సెక్సీ చిత్రాన్ని ప్రచురించిన కుముదం తమన్నా ఫోటోలో ఆమె బొడ్డు కింద పేజీ నెంబరును తేదీని ప్రచురించింది. దీనితో ప్రస్తుతం చెన్నైలో ఎక్కడ చూసినా ‘కుముదం’ పత్రిక సంచికలతో హడావిడి కనిపిస్తోంది. 

ఒకవైపు ‘కుముదం’ పత్రికకు తాను ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని తమన్నా చెపుతున్నా ఆ పత్రిక యాజమాన్యం ఇంత ధైర్యంగా ఒక ఫేక్ ఇంటర్వ్యూను తమ పత్రికలో ప్రచురిoచడం టాపిక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. ఇప్పటికే ‘ది రేప్ ఆఫ్ అవంతిక’ అంటూ బాలీవుడ్ మీడియా తమన్నాను దుమ్మెత్తిపోసిన తరువాత తమన్నాను టార్గెట్ చేస్తూ కుముదం పత్రిక ఇలా రంగంలోకి దిగడం హాట్ న్యూస్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: