ప్రిన్స్ మహేష్ బాబు ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకనాటి అతిలోక సుందరి శ్రీదేవికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటి దాకా అనేక సందర్భాలలో తాను చిన్న తనం నుండి శ్రీదేవి గ్లామర్ కు అభిమానిగా మారిపోయాను అంటూ అనేక సార్లు చెప్పిన మహేష్ తన మాట మార్చాడు. హీరోయిన్స్ గురించి పెద్దగా కామెంట్స్ చేయని మహేష్ తన మనసులో మాట బయట పెట్టాడు. 

మహేష్ తో ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మీడియా ప్రతినిధి ప్రస్తుత పరిస్థుతులలో మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ ఎవరు ? అని అడిగిన ప్రశ్నకు మహేష్ సమాధానం ఇస్తూ తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ గా శ్రీదేవి ఉన్నా ప్రస్తుతం తన మనసులో మాత్రం దీపికా పదుకొనెను అభిమానిస్తున్నానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీపిక నటించిన ‘పీకు’ సినిమా చూసిన తరువాత తాను దీపిక అభిమానిగా మారిపోయాను అని కామెంట్ చేసాడు మహేష్. 

ఇదే సందర్భంలో దీపికతో నటించే అవకాశం వస్తే నటిస్తావా ? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మహేష్ అటువంటి అవకాశాన్ని వదులుకోను అని అనడం బట్టి త్వరలోనే మహేష్ దీపికల కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందా అనే సంకేతాలు ఇచ్చాడు. ఎప్పటి నుంచో దక్షిణాది సినిమా రంగం పై కన్ను ఉన్న దీపికకు మహేష్ కామెంట్స్ మంచి జోష్ ను ఇస్తాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కొచ్చాడియన్’ సినిమాలో నటించినా ఆ సినిమా కలిసి రాకపోవడంతో దక్షిణాది సినిమా రంగం పై ఆశలు వదులుకున్న దీపికకు మహేష్ లేటెస్ట్ కామెంట్స్ మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. బాలీవుడ్ భారీ పారితోషిక హీరోయిన్స్ రేస్ లో కంగనా రనౌత్ క్రేజ్ ముందు నిలబడలేక పోతున్న దీపిక తన రూట్ మార్చి మహేష్ కామెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో దక్షిణాది సినిమాలలో మరోసారి ప్రయత్నిస్తుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: