బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమా ఆడియో విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఆడియో వేడుకకు సంబంధించి వస్తున్న వార్తలు చాల షాకింగ్ గా మారుతున్నాయి. అమరావతిలో ఈ ఆడియో వేడుక జరగబోతూ ఉండటం ఒక సంచలనమైతే ఎప్పుడూ లేని విధంగా ఈ ఆడియో వేడుకకు ముందు బాలకృష్ణ అభిమానులు చేపట్టబోతున్న 99 వెహికల్స్ ర్యాలీ ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. 

బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ బాలయ్య 99వ సినిమా కావడంతో ఇరు రాష్ట్రాలలోని బాలయ్య అభిమానులు ‘డిక్టేటర్’ ఆడియో వేడుక జరిగే అమరావతి ప్రాంతానికి 99 వెహికల్స్ తో ఒక మోటార్ ర్యాలీని నిర్వహించడానికి నందమూరి అభిమానులు భారీ స్కెచ్ వేసినట్లు టాక్. దాదాపు లక్ష మంది అభిమానులను ఈ ఆడియో వేడుకకు తీసుకు వచ్చి బాలయ్య క్రేజ్ ను చాటడానికి భారీ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి అని తెలుస్తోంది.

డిసెంబర్ 20న జరగబోతున్న ఈ ఆడియో వేడుక ఏర్పాట్లు చాల ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఇప్పటికే బాలకృష్ణ ‘డిక్టేటర్’ దర్శక నిర్మాతలకు సూచించినట్లు టాక్. దీనితో ఈ వారం నుండే ఈ ఆడియో వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతున్నాయని తెలుస్తోంది. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన ఒక రియల్ హీరోగా బాలయ్యను ఈసినిమాలో చూస్తారు అని అంటున్నారు.

బాలకృష్ణకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే సంక్రాంతి పండుగను ఆధారంగా చేసుకుని భారీ కలెక్షన్స్ పై కన్నేసి వస్తున్న ఈ ‘డిక్టేటర్’ కు పోటీగా జూనియర్ నిలుస్తాడా ? లేదంటే లేదంటే నాగార్జున నిలుస్తాడా అనే విషయం పై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ‘డిక్టేటర్’ మాత్రం తన హడవిడిని అప్పుడే ప్రారంభించేసింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: