తమిళ ఇండస్ట్రీలో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి శృంగార తారగా పేరు తెచ్చుకుంది సోనా. తమిళ ఇండస్ట్రీలో బీ గ్రేడ్ సినిమాలో నటిస్తూ.. ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారు మతులు పొగొట్టిన ఈ భామ ఆకర్షించే ఫిజిక్ తో బాగానే పాపులర్ అయ్యింది. మళియాళీ హాట్ భామ షకీలా నటించిన సినిమాలకు ఏ రేంజ్ లోడిమాండ్ ఉండేదో సోనా నటించిన సినిమాలకు కూడా ఆదే రేంజ్ లో డిమాండ్ ఉండేది. ఆ మద్య సోనా ఇకపై అలాంటి బీ గ్రేడ్ సినిమాల్లో నటించనని ముఖ్యంగా గ్లామర్ పాత్రల్లో అస్సులు నటించనని ప్రకటన చేసింది. దీంతో ఈ అమ్మడికి సినిమా చాన్సులు తగ్గిపోయాయి. ఇక యూత్‌లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ తగ్గిపోయింది.


ఇప్పుడు సోనా మానవత్వాన్ని చాటే మంచి పని చేసి అందరి మనసు దోచింది. తమిళ నాడు లో భారీ వర్షాలు రావడంతో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రభుత్వం ఎంత సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ తోటి మనిషి సహాయం కూడా కావాలన్న సహృదయంతో.. చాలా మంది సినిమా స్టార్లు కదిలారు. ఇక సోనా వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. తనతోపాటు తన అభిమానుల్ని, ఇతర నటీనటుల్ని కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలన్న తలంపుతో ‘రైస్‌ బౌల్‌ ఛాలెంజ్‌’ను ప్రారంభించింది.

సోనా


గతేడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ స్ఫూర్తితో సోనా రైస్‌ ఛాలెంజ్‌ను ప్రకటించింది. బియ్యంను దానం చేయడమే రైస్‌ బౌల్‌ ఛాలెంజ్. ఈ చాలంజ్ తో వచ్చిన బియ్యాన్ని సేకరించి నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని చూస్తుందట సోనా. ఇప్పటికే 200 కేజీల వరకు సేకరించినట్లు చెబుతుంది. వీలైనంత ఎక్కువ మోతాదులో బియ్యం సేకరించి, వరద బాధితులకు పంపిణీ చేయాలని సోనా కృషికి అందరూ సంతోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: