అదేంటి టైగర్ ట్రైన్లో దర్శనమిస్తే అందరు ఎక్కడిక్కడికి పరుగులు తీయాలి కాని అవాక్కవ్వమేంటనేగా మీ డౌట్ కదా.. ఇక్కడ టైగర్ అంటే నిజమైంది కాదులేండి. రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమా గురించి. వివరాల్లోకి వెళితే ఇప్పుడు సినిమాలు ఎలా తీశామన్నది కాదు సినిమాను ఎంత షార్ప్ గా క్యాచీగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లామన్నదే పాయింట్. బాలీవుడ్ సినిమాలతో పోల్చితే మన వాళ్లు ఆ ప్రమోషన్ లెవెల్స్ ని ఏమాత్రం చేయరని మనకు తెలిసిందే కాని ఇప్పుడిప్పుడే మన దర్శక నిర్మాతల ఆలోచనల్లో మార్పు వచ్చి వీలైననత వరకు సినిమా ప్రమోషన్ ద్వారానే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


సైజ్ జీరో సినిమాతో మొదలైన ఈ ట్రైన్ ప్రమోషన్ బెంగాల్ టైగర్ కి కూడా పాకింది. బోగీల్లో బెంగాల్ టైగర్ పోస్టర్స్ తో అలరిస్తున్నాడు రవితేజ. తమన్నా, రాశి ఖన్నాల అందాలు హైలెట్ అవుతున్న ఈ సినిమా పోస్టర్స్ ట్రైన్లో సందడి చేస్తూ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. కిక్-2 ఫ్లాప్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీదున్నాడు మాస్ మహరాజ్. ఇక సినిమా డైరక్టర్ సంపత్ కూడా సర్ధార్ సినిమా నుండి తనను తొలగించిన కసితో ఈ సినిమా చేశాడు. ఏ విధంగా చూసుకున్నా ఈ సినిమా కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ,తమన్నా :


ఇక హీరోయిన్స్ గా నటించిన తమన్నా, రాశిల అందాలు సినిమాకు మరింత కలరింగ్ తెచ్చిపెట్టాయి. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ సినిమా మీద భారీ అంచనాలు కలిగేలా చేస్తే.. భీంస్ అందించిన సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. రవితేజ మార్క్ మాస్ అంశాల మేలవింపుతో వస్తున్న బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు.


మరి ట్రైన్ ప్రమోషన్ కూడా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునెలా చేసింది కాబట్టి సినిమా మొదటి రోజే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహం ఆడియెన్స్ లో ఏర్పడింది. మరి సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. రెండు సార్లు రిలీజ్ అనుకుని పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా సక్సెస్ మీదే రవితేజ కెరియర్ ఆధారపడి ఉంది. దీని తర్వాత రవితేజ దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: