మహేష్ మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతున్న భారీ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ఆ న్యూస్ మెగా కాంపౌండును కలవర పాటులో పడేసింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఎస్వీ. ప్రసాద్ ఠాగూర్ మధులు తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. చిరంజీవికి అత్యంత ఆత్మీయులైన వీరిద్దరు మహేష్ తో 100 కోట్ల భారీ సినిమాను తీస్తూ ఉండటమే కాకుండా ఈసినిమాకు సంభందించి మహేష్ కు 25 కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం కూడ మెగా కుటుంబానికి ముఖ్యంగా చిరంజీవి రామ్ చరణ్ లకు షాకింగ్ గా మారింది అనే వార్తలు వస్తున్నాయి. 

చిరంజీవి మెగా స్టార్ గా మారడానికి  ఎన్టీఆర్ కు వీర విధేయులుగా ఉన్న అశ్వనీదత్ దేవీ వరప్రసాద్ త్రివిక్రమ రావులు నిర్మించిన భారీ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిరంజీవి సినిమాల మార్కెట్ ను  అదేవిధంగా చిరంజీవి పారితోషికం పెరగడంలో ఈ నిర్మాతలు ఆరోజులలో ఎంతో సహకరించారు అనే వార్తలు ఉన్నాయి. అలాగే ఎస్వీ.  ప్రసాద్ ఠాగూర్ మధులు చిరంజీవికి వీర విధేయులుగా ఉండటమే కాకుండా మెగా కాంపౌండ్ కు సొంత మనుషులులా ప్రవర్తిస్తూ వచ్చారు. 

అయితే ఇప్పుడు వీరద్దరు కలిసి మహేష్ తో భారీ సినిమాను తీస్తూ ఉండటంతో నెమ్మదిగా మెగా కాంపౌండ్ నిర్మాతలు అంతా మహేష్ నిర్మాతలుగా మారిపోతారా అనే అనుమానం మెగా కాంపౌండ్ ను వెంటాడుతోంది అని టాక్. ఈ పరిస్థితులు ఇలా మారి పోవడానికి  రామ్ చరణ్ తన నిర్మాతలతో వ్యవహరిస్తున్న తీరుకూడ కారణం అనే మాటలు విని పిస్తున్నాయి. ‘బ్రూస్ లీ’ ఘోర పరాజయం తరువాత  రిలాక్స్ కావడానికి అమెరికా వెళ్ళిన రామ్ చరణ్ తిరిగి వచ్చినా  ‘థని ఒరువన్’  ఎప్పుడు మొదలు పెడతాడో మెగా కాంపౌండ్ కే తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. 

దీనికితోడు గౌతమ్ మీనన్ చరణ్ తో సినిమా చేస్తాడు అనే వార్తలు ఆమధ్య వచ్చినా ఆవార్తలు కూడ ఇప్పుడు ఆగిపోయయాయి. ఈపరిస్థితులు ఇలా ఏర్పడటానికి చరణ్ చాలామంది దర్శకులకు అందు బాటులో ఉంటo లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మెగా కాంపౌండ్ కు అత్యంత నమ్మకంగా ఉండే వినాయక్ కూడ జూనియర్ తో తనతదుపరి సినిమా ఆలోచనలలో ఉన్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా కంపౌండుకు సన్నిహితంగా ఉండే నిర్మాతలు దర్శకులు మెగా కాంపౌండుకు దూరంఅవడం ప్రారంభిస్తే రామ్ చరణ్ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ప్రస్తుతం కలవరపాటులో మెగా కాంపౌండ్ ఉంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: