యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్ళి కొడుకుగా మారి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ లీక్ చేసాడు. తాను వచ్చే సంవత్సరం 2016 సమ్మర్ లోపు పెళ్ళి చేసుకునే అవకశాలు ఉన్నాయి అంటూ నిఖిల్ మీడియాకు లీక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న నిఖిల్ ‘శంకరాభరణం’ సినిమాను ప్రమోట్ చేస్తున్న సందర్భంలో తన పెళ్ళి గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నిఖిల్ లీక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఈమధ్య తన చెల్లెలు సొనాలి పెళ్ళి జరిగిన తరువాత తన తల్లితండ్రుల నుండి తన పెళ్ళి విషయమై ఒత్తిడి పెరిగిపోతోంది అని అంటూ గతంలో తనకు వరసగా రెండు హిట్స్ వస్తే పెళ్ళి చేసుకుంటానని తన తల్లితండ్రులకు మాట ఇచ్చానని అయితే రెండు హిట్స్ వచ్చి వెళ్ళిపోయినా తాను పెళ్ళి విషయం తేల్చక పోవడంతో తన పై ఈ ఒత్తిడి పెరిగి పోతోంది అంటూ తన పై తానే నిఖిల్ సెటైర్లు వేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే నిఖిల్ తన తల్లితండ్రులు చూసిన అమ్మాయికే ఓటు వేస్తున్నాడు అనుకోవాలి. 

‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాల వరస విజయాల తరువాత నిఖిల్ నటించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ పరాజయం చెందినా యంగ్ హీరోల లిస్టులో నిఖిల్ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘శంకరాభరణం’ సినిమా పై ఈ యంగ్ హీరో  చాలా నమ్మకం పెట్టుకోవడమే కాకుండా ఈ సినిమా తనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అన్న నమ్మకంలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.

గతవారం విడుదలైన ‘సైజ్ జీరో’ కమర్షియల్ గా విజయవంతం కాకపోవడంతో ప్రస్తుతం ఈవారం విడుదల అవుతున్న ‘శంకరాభరణం’ కు గట్టి పోటీ ఇచ్చే సినిమాలు లేవనే చెప్పాలి. దీనితో అన్ని పరిస్థుతులు నిఖిల్ కు అనుకూలంగా మారడంతో ‘శంకరాభరణం’ హిట్ కొడితే నిఖిల్ కూడ కోటి రూపాయల పారితోషిక స్థాయికి చేరినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: