తెలుగు ఇండస్ట్రీలోకి హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ తర్వాత వచ్చిన సినిమాలు కాస్తో కూస్తో నడిచినా..తర్వాత వచ్చిన సినిమాలు పూర్తిగా దెబ్బతీశాయి.   వరుణ్ సందేశ్ ఒడిషాలోని రాయగడ లో  జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ మారడంతో అక్కడ నాలుగేళ్ళు ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి పోయాడు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది.  హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. వరుణ్ సందేశ్ టీవీ నటుడు జీడిగుంట శ్రీదర్ దగ్గరి బంధువు.


కొత్త బంగారు లోకం, కుర్రాడు,హ్యాపీ హ్యాపీగా , ఢి ఫర్ దోపిడి , ఎవరైనా ఎపుడైనా సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.  ఆ మద్య ‘పడ్డానండీ ప్రేమలో మరి ’ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోయిన్ వితిక షేర్ ప్రేమలో నిజంగానే పడిపోయాడు. గత కొంత కాలంగా ప్రేమాయణం నడిపించిన వీరు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి ప్రేమను ఒప్పుకున్న ఇరు కుటుంబసభ్యులు డిసెంబర్ 7 నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో హర్షవర్ధన్ రాణేకి జోడీగా కనిపించిన వితిక షేరుని వరుణ్‌సందేశ్ పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరి కాంబినే షన్‌లో ‘పడ్డానండి ప్రేమ’లో సినిమా వచ్చింది.

వరుణ్ సందేశ్, వితిక షేర్


హైద్రాబాద్ లోనే పలువురు సినీ ,రాజకీయ ,కుటుంబసభ్యుల సమక్షంలో ఏంగేజ్ మెంట్ జరుగనుంది..ఈ విషయాన్ని హీరో వరుణ్ సందేశ్ తన ఫేస్ బుక్ ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు..అంతేకాకుండా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఇప్పటికే తెలుగు ,తమిళ ,కన్నడ భాషల్లో  హీరోయిన్ గా నటించింది వితిక. వీరి పెళ్లిని వచ్చే ఏడాది పిభ్రవరిలో చేయనున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: