మాస్ కి పర్ఫెక్ట్ రూపం అంటే దాన్ని మహరాజాగా అనుభవించే రవితేజాదే అని చెప్పాలి. నాటు కొట్టుడు నీటు కొట్టుడు కలిపి కొట్టాలి అన్నట్టు సినిమా ఏదైనా క్లాస్ మాస్ అని తేడా లేకుండా అభిమానులతో పాటుగా సగటు సినిమా ప్రేక్షకుడిని తన నటనతో ఇట్టే ఆకట్టుకుంటాడు రవితేజ. కెరియర్ కొద్దిగా స్లో అవుతుంది అనుకున్న టైంలో బలుపు, పవర్ సినిమాలతో ఫుల్ చార్జ్ అయ్యి మళ్లీ కిక్-2 ద్వారా వచ్చిన క్రేజ్ నంతా పోగొట్టుకున్నాడు. ఇంతకుముందు ఇయర్లో రెండు మూడు సినిమాలతో అలరించే రవితేజ ఇప్పుడు సంవత్సరానికి ఒక్క సినిమా ఇచ్చినా గ్రేటే అన్నట్టు ఉంది పరిస్థితి. 


ఇక తీసిన సినిమాలన్ని ఫ్లాప్ బాట పట్టడంతో డీలా పడ్డ రవితేజ బెంగాల్ టైగర్ తో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అటు సర్ధార్ నుండి అవమానంతో తొలగించబడ్డ సంపత్ కూడా సినిమా హిట్ కొట్టి తన ఖలేజా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే సంపత్ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మాస్ అభిమానులను సినిమా ఎలా తీయాలో బాగా తెలిసిన సంపత్ సినిమా కచ్చితంగా హిట్ కొడతాడనే అనుకుంటున్నారు.


అయితే ఈ నెల 10న రిలీజ్ కాబోతున్న బెంగాల్ టైగర్ సినిమా గురించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ప్రచారంలో మునిగి తేలుతుంది. అయితే మైక్ అందుకున్న సంపత్ తనని సర్ధార్ సినిమా నుండి తీసేసిన కారణాలు చెప్పకుండానే ఆ సినిమా ప్రస్థావన తేకుండా సర్ధార్ సినిమాపై యాంటి కామెంట్స్ చేశాడు. కొద్ది కాలంగా అస్థవ్యస్థంగా ఉన్న తన జీవితాన్ని బెంగాల్ టైగర్ సినిమా ఇచ్చి తనని నిలబెట్టాడని రవితేజ గురించి మాట్లాడాడు సంపత్. క్లియర్ గా వింటే సంపత్ జీవితం అలా అగమ్య గోచరంగా తయారయ్యింది సర్ధార్ సినిమా నుండి తీసేయబడటమే అని చెప్పుక్కొచ్చాడన్న మాట.


సర్ధార్ సినిమాకు ముందు దర్శకుడిగా సంపత్ ని అనుకున్నా పవర్ స్టార్ స్టామినాను మెయిన్ టైన్ చేయాలంటే తన దర్శకత్వ ప్రతిభ సరిపోదు అనుకున్నాడో ఏమో ఆ సినిమా నుండి తనని తప్పించి బాబీ ని పెట్టించాడు పవన్ కళ్యాణ్.. అయినా సరే పవర్ స్టార్ మీద తనకు ఇంకా అభిమానం ఉందని.. తనకు నాకు ఒక్క ఫోన్ కాల్ దూరమే అని అన్నాడు సంపత్. కాబట్టి రవితేజతో బెంగాల్ టైగర్ హిట్ కొట్టి తానేంటో ఋజువు చేసుకోవాలనుకుంటున్నాడు సంపత్.. మరి దర్శకుడి ఆశలు సినిమా తీర్చేనా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: