చిన్నతనం నుండి సినిమాల్లో కనిపిస్తూ పెరిగిన నిఖిల్ ఇప్పుడు మంచి హీరోగా సెటిల్ అయ్యాడు. తేజ జయం సినిమాలో చిన్న నాటి గోపీచంద్ క్యారక్టర్ చేసిన నిఖిల్.. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో రాజేష్ లా కనిపించి అదరగొట్టాడు. కాలనీలో అల్లరిచిల్లరగా కుర్రాడిలా కనిపించిన రాజేష్ పాత్రలో నిఖిల్ సింప్లీ సూపర్బ్.. ఆ సినిమా తెచ్చిన క్రేజ్ తోనే హీరోగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. హీరోగా మొదట్లో యువత లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో హిట్ కొట్టిన నిఖిల్ సడెన్ గా రూటు మార్చి వీడు తేడా లాంటి సినిమాలు తీసి కెరియర్ సంక్షోభంలో పెట్టుకున్నాడు.


అయితే ఆ క్రమంలో సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ అనే మాటకు దాదాపు కిలో మీటర్ దూరంలో ఉండే వాడు. అయితే ఈ లోపు తనకు పెళ్లి చేయాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు నిఖిల్ దగ్గర పెళ్లి ప్రస్థావన తెచ్చారట. తాను రెండు వరుస హిట్లు కొడితే గాని పెళ్లి చేసుకోను అప్పటిదాకా తన పెళ్లి గురించి ఇంట్లో కూడా మాట్లాడొద్దని గట్టిగానే చెప్పాడట. నిఖిల్ మాట మేరకు అతని సినిమా హిట్ కోసం ఇంట్లో సభ్యులు కూడా చూడ సాగారు. అయితే మూస థోరణీలో పోతున్న సినిమాలను దాటేసి మరోసారి వర్మ మార్క్ స్క్రీన్ ప్లే తో సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామిరారా హిట్ నిఖిల్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


ఆ సినిమా హిట్ ఇచ్చిన కిక్ ని ఎంజాయ్ చేసిన నిఖిల్ వెంటనే తొందరపడి సినిమా చేయకుండా చందు మొండేటి డైరక్షన్లో కార్తికేయ లాంటి డిఫరెంట్ సినిమా చేశాడు. అది కూడా ఊహించని విధంగా ప్రేక్షకాదరణ పొందింది. సినిమా హిట్ అని తెలిసిన నిఖిల్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ దారిలోనే సూర్య వర్సెస్ సూర్య అంటూ సాయంత్రం వేళ మాత్రమే బయటకు వచ్చే పాత్రలో నటించి పర్వాలేదనిపించుకున్నాడు. అయితే నిఖిల్ చెప్పిన దాని ప్రకారం రెండు వరుస హిట్లు పడ్డ వెంటనే పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి ఇంట్లో వారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారట. నిఖిల్ కి జోడీని వెతికే పనిలో కూడా పడ్డారని తెలుస్తుంది.


సో కెరియర్లో సక్సెస్ వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పిన నిఖిల్ కు మొదటి హిట్ సుధీర్ వర్మ ఇస్తే.. రెండో హిట్ చందు ఇచ్చాడు. సో ఒకరకంగా నిఖిల్ పెళ్లికి సిద్ధమయ్యేలా చేసింది వీరిద్దరే అని లాజికల్ గా చెప్పొచ్చు. కాని స్వామిరారా, కార్తికేయ సినిమాల్లు నిఖిల్ కెరియర్లో ఎప్పటికి మంచి సినిమాలన్న విషయం మాత్రం నిజం.. అన్నట్టు మరో మూడు రోజుల్లో కోనా నిర్మాణ సారధ్యంలో నిఖిల్ నటించిన శంకరాభరణం కూడా రిలీజ్ అవుతుంది. మరి హ్యాట్రిక్ హిట్ కొట్టిన నిఖిల్ ఈ సినిమా కూడా సక్సెస్ చేసుకుని డబుల్ హ్యాట్రిక్ కి పరుగులు తీస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: