పవన్ కళ్యాణ్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ కోసం వడోదరాలోని రాయల్ ప్యాలెస్ లో చేస్తున్న రొమాంటిక్ సీన్స్ కు సంబంధించి ఒక ఆశక్తికర విషయం బయటకు వచ్చింది. సామాన్యంగా పవన్ తాను నటించే సినిమాలలో హీరోయిన్స్ తో ఇంటిమేట్ సీన్స్ లో పెద్దగా నటించడానికి ఇష్టపడడు. అయితే దీనికి భిన్నంగా పవన్ కాజల్ తో కలిసి వడోదరా రాయల్ ప్యాలెస్ లో రొమాంటిక్ గా రెచ్చి పోతున్నట్లు టాక్. 

అద్భుతమైన రాయల్ ప్యాలెస్ వాతావరణంలో సూపర్బ్ కాస్ట్యూమ్స్ తో కాజల్ నిజమైన చందమామలా మెరిసిపోతూ ఉంటే కాజల్ తో అతిసన్నిహితంగా పవన్ ఒక పాట కోసం నటిస్తున్న సన్నివేశాలను దర్శకుడు బాబి పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా చిత్రీకరించినట్లు టాక్. ఈ రొమాంటిక్ సాంగ్ ను డైరెక్టర్ బాబి చిత్రీకరించిన విధానానికి ఈ సినిమా యూనిట్ సభ్యులందరూ ఆశ్చర్యపోయినట్లు టాక్. హీరోయిన్ కాజల్ కూడ ఈపాటలో చాల అందంగా కనిపించడమే కాకుండా పవన్ తో ఇంటిమేట్ గా నటిస్తూ పవన్ అభిమానులకు జోష్ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. 

ఈసినిమా విషయంలో దర్శకుడు బాబి పడుతున్న కష్టాన్ని చూసి పవన్ కూడ మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమా ఔట్ పుట్ కి సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడ షేర్ చేసుకుంటూ ఈసినిమా ఇమేజ్ ను పెంచుతున్న నిర్మాత శరత్ మరార్ ప్రయత్నాలకు వంత కలుపుతూ హీరోయిన్ కాజల్ కూడ తన గెటప్ ని షేర్ చేసి ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చింది. మరో వారంపాటు ఈ సాంగ్ షూట్ నిర్వహించనున్నారు అని తెలుస్తోంది. 

డిసెంబర్ 8తో దీన్ని కంప్లీట్ చేసి గుజరాత్ షెడ్యూల్ ని క్లోజ్ చేయలని పవన్ ఆలోచన అని అంటున్నారు. ఆ తరువాత హైద్రాబాద్ లోనే మిగిలిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు అని టాక్. పవన్ హైద్రాబాద్ తిరిగి వచ్చాక పవన్ తో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు లక్ష్మీరాయ్ సంజనలు కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాలో కూడ పవన్ చేత ఒక మాస్ సాంగ్ ను పవన్ తో పాడించి ఈసినిమాకు సంబంధించి మరో షాక్ ఇవ్వబోతున్నాడు అని టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: