తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రాక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవీశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవి చిత్రంతో తన కెరీర్ ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం  వహించారు. అయితే ఈ మద్య దేవీ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవీశ్రీ ప్రసాద్ ఏ చిత్రానికి మ్యూజిక్ అందించినా ఆ చిత్రం ఆడియో రిలీజ్ సమయంలో పెద్ద హంగామా సృష్టిస్తాడు.


ఇక తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సూర్య నటించిన ‘సింగం’, సింగం 2 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలకు దేవి సంగీతం అందించాడు..ఈ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.  త్వరలో సింగం-3 కూడా రాబోతోంది. తొలుత ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల దేవి శ్రీనే తీసుకుందామనుకున్నారు. మళ్లీ ఏమైందో కాని ఆ ప్లేస్ లో హారిస్ జైరాజ్ కు అప్పగించడం చర్చనీయాంశం అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే దేవిశ్రీ కావాలనే తప్పుకున్నాడా? లేక మరేదైనా కారణంతో సింగం-3 దర్శకుడు హరి దేవిశ్రీని తప్పించాడా? అనేది తెలియాల్సి ఉంది.  

సింగం పోస్టర్


హారిస్ జైరాజ్ హీరో సూర్యకి ఇప్పటికే ఎన్న హిట్ సినిమాలకు సంగీతం అందించారు..కాకా కాకా, గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్ వంటి సినిమాలకు సంగీతం అందించారు.  ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించడం కొత్త విషయం..ఇకపోతే తొలి రెండు చిత్రాల్లో సందడి చేసిన అనుష్క సింగం-3లోనూ నటిస్తోంది. సింగం-2లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన హన్సిక స్థానానంలో శృతిహాసన్ నటిస్తోంది. ఈ రోజునుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది..తొలి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జరుగుతుందని చిత్రం యూనిట్ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: