సెక్స్, రోమాన్స్, హర్రర్ కలిపి సినిమాలు చేయడం ఒకప్పటి రామ్ గోపాల్ వర్మ మార్క్.. నోటికొచ్చింది మాట్లాడటం.. అందరితో తిట్లు తినడం ఇప్పుడు వర్మ కొత్తరకం మార్క్ గా తయారైంది. సినిమాలతో కన్నా ట్వీట్లు, కామెంట్లతోనే వర్మ ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఇక ఆయన శ్రీదేవి పిచ్చి సంగతి అందరికీ తెలిసిందే.. ఆ పిచ్చే ఇప్పుడు ఆయనకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. శ్రీదేవి భర్తతో చీవాట్లు పెట్టిస్తోంది. 

విషయం ఏంటంటే.. గతంలో నా ఇష్టం అంటూ ఓ పుస్తకం రాసిన వర్మ.. లేటెస్టుగా వర్మ గన్స్ అండ్ థైస్ అనే పుస్తకం రాస్తున్నాడు. సినిమాకైనా, పుస్తకానికైనా పబ్లిసిటీ ఎలా సంపాదించుకోవాలో వర్మకు బాగా తెలుసు. అందుకే పుస్తకం రెడీ కాకముందు నుంచే కాంట్రావర్సీలకు తెర తీశాడు. పుస్తకం పేరే ఓ సంచలనం. దీనికితోడు అందులో ఒక్కో అధ్యాయంలో ఒక్కో సంచలనం ఉందంటూ ముందు నుంచే ఊరించేస్తున్నాడు వర్మ.  

ఈ గన్స్ అండ్ థైస్ పుస్తకంలో తన శ్రీదేవి పిచ్చిని మరింత డిటైల్డ్ రాశాడట. శ్రీదేవి కోసం ఏకంగా ఓ చాప్టరే కేటాయించాడట. అందలోనూ ఆ చాప్టర్ ఓ  ప్రేమలేఖ తరహాలో ఉంటుందట. అంతేకాదు. తాను అందాల దేవతగా పూజించే శ్రీదేవి భర్తపై కూడా వర్మ ఘాటు కామెంట్లే చేశాడు. తన సౌందర్య రాశిని వంటింటికి తెచ్చుకున్న శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను ఎప్పటికీ తాను క్షమించలేనన్నాడు. 

వర్మ లేటెస్టు కామెంట్లపై శ్రీదేవి భర్త గుర్రుగా ఉన్నారట. అవును మరి తన పెళ్లాన్ని పట్టుకుని.. ప్రేమలేఖ.. ప్రత్యేక అధ్యాయం అంటే ఎవరికైనా మండదా. సహజంగానే బోనీ కపూర్ కు కూడా మండింది. అందుకే వర్మ వ్యవహార శైలిపై లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నాడాయన. రామ్ గోపాల్ వర్మ ఒక వెర్రి మనిషి అని... అతనిది వికృత మనస్తత్వం.. అని ఘాటుగా కామెంట్ చేశాడు. అంతేకాదు.. పబ్లిసిటీ కోసమే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: