వర్మపై విమర్శలు కురిపించని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. వర్మని అభిమానించే వారు ఎంతమంది ఉంటారో తెలియదు కాని వర్మని ద్వేషించే వారు పరిశ్రమలో చాలామంది ఉన్నారన్నది నిజం. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే వర్మ తను రాసిన 'గన్స్ అండ్ థైస్' పుస్తకంలో కొన్ని మాటలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇక తన పుస్తకంలో వర్మ 'గాడెస్ ఆఫ్ బ్యూటీ' శ్రీదేవి గురించి ఒక పేజి మొత్తం రాయడం విశేషం. తన పుస్తకంలో శ్రీదేవి గురించి ప్రత్యేకించి ప్రస్థావించిన వర్మ తను దేవతలా ఆరాధించే ఆమెను కిచెన్ లో టీ పెట్టించేలా చేసిన బోనీ కపూర్ ని తను ఎప్పటికీ క్షమించనని రాసుకున్నాడు.


దీనికి అదే విధంగా స్పందించిన బోనీ ఇలాంటి వన్నీ వర్మ పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని తను చేసే కామెంట్స్ కి సెలబ్రిటీస్ మాట్లాడితే అది తనకు క్రేజ్ తీసుకువస్తుందనే భావనలో ఉన్నాడని మాట్లాడాడు. అయినా తన మాటలకు స్పంచింది మరింత పబ్లిసిటీ తాను ఇవ్వనని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే మాట్లాడను.. స్పందించను అంటూనే చెప్పాల్సిన విషయం అంతా వెళ్లగక్కాడు బోనీ కపూర్. వర్మ మీద బోనీ కోపంగా ఉన్నాడని ఎప్పటినుండో తెలిసిందే.


తాజాగా మరోసారి అది బహిర్గతం అయ్యేలా వర్మ రాసిన 'గన్స్ అండ్ థైస్' బుక్ కారణం అయ్యింది. ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఇలాంటి రకరకాల స్పెషల్ థింగ్స్ చేయడం వర్మ గొప్పతనం. ప్రస్తుతం వర్మ డైరక్టోరియల్ నుండి వస్తున్న సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ని పోలీసులు ఎలా చేదించారనే కథాశంతో ఈ సినిమా తెరకెక్కించబడింది. సినిమా రిలీజ్ ని ఆపేసే ప్రయత్నంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఉండగా సినిమాను ఎలాగైనా రిలీజ్ చేసేలా చూస్తున్నాడు వర్మ.


ఈ సినిమా తర్వాత మంచు మనోజ్ ఎటాక్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వర్మ. ప్రస్తుతానికైతే వర్మ బోనీల మాటల యుద్ధం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి బోనీ ఇచ్చిన షాక్ కి వర్మ ఎలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేస్తాడో అని మీడియా ఎదురు చూస్తుంది. వర్మ బోనీకి కౌంటర్ ఇచ్చే మాటలు కచ్చితంగా అందరిని షాక్ కి గురి చేస్తాయన్నది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే తనని తాను ఏ విషయంలోనైనా సమర్ధించుకునే వర్మ బోనీ కపూర్ అన్న మాటలకు గట్టి కౌంటరే ఇస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: