తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అంటే అదో రంగుల ప్రపంచం. నిత్యం మొఖానికి రంగులు  పూసుకుని రంగు రంగుల వాతావ‌ర‌ణంలో ఉల్లాసంగా జీవించ‌డం. ఎప్పుడూ బిజీ బిజీ జీవ‌నం, అభిమానులు కోలాహ‌లం, ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ.. ఇలా సాగిపోతుంది సినీ హీరోల‌, హీరోయిల జీవితం. ఇక ఆర్ధికంగా ఎంతో బ‌లం చేకూర‌డ‌మే కాకుండా.. స‌మాజంలో గొప్ప పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంటు ఉంటారు. క్ష‌ణం తీరిక లేకుండా ఉంటూ నిత్యం చేతి నిండా డబ్బులు, కారు బంగ్లాలు ,  చేసి పెట్ట‌డానికి ప‌నిమ‌నుషులు, త‌న మంచి  చెడులు, కాల్ షెడ్యూల్, షూటింగ్ స‌మ‌యాల‌ను కేటాయించ‌డానికి ప్ర‌త్యేక సిబ్బంది. ఇదీ, సినిమా రంగంలో పనిచేసే వారి విలాసవంత‌మైన జీవితం. కానీ ఒక్క‌సారి వారి జీవితం తారుమారు అయ్యిందంటే అంతే, ఇక వారు బ్ర‌త‌క‌డం క‌ష్ట‌మే గా భావిస్తూ అర్ధ‌తరంగా తమ జీవితాలకు ముగింపు ప‌లుకుతున్నారు. నాటి సిల్క్ స్మీత నుంచి నేటి రంగ‌నాథ్ వర‌కు అవ‌కాశాల‌లేమీ, ఆర్ధికం ఇబ్బందులు, ఒంటిరిత‌నంతోనే అర్థంత‌రంగా త‌మ జీవితాల‌కు పుల్ స్టాప్ పెడుతున్నారు.   

 సినీ జీవితంలో వారి అనుభ‌వించే జీవితాల‌ను నిజం జీవితంతో పొల్చుకోవ‌డ‌మే


ఇందుకు కారణాలు ఏమిటా అని అరాధిస్తే.. సినీ జీవితంలో వారి అనుభ‌వించే జీవితాల‌ను నిజం జీవితంతో పొల్చుకోవ‌డ‌మే బ‌ల‌మైన కార‌ణాలుగా భావిస్తున్నారు ప‌లువురు సైక్రియాట్రిస్టులు. అంతేకాకుండా సినీ రంగంలో వారికి ఆద‌ర‌ణ త‌గ్గ‌డం, ఆర్థిక ఇబ్బందులు, ఒంట‌రిత‌నం, ప్రేమ వైఫ‌ల్యాల‌ను బరించ‌లేక చిన్న‌త‌నంలోనే బ‌ల‌వన్మ‌ర‌ణాలు పాలుప‌డుతున్నారు. ఈ తంతూ ఇప్ప‌టిదే కాదు... దాదాపు గ‌త ద‌శాబ్ధాల నుంచి నడుస్తోంది. గ‌తంలో జ‌రిగిన మ‌ర‌ణాలను గ‌మ‌నిస్తే.. నాటి స‌హ‌జ న‌టి, ఆమె తెర‌పైకి వ‌చ్చిందంటే ప్రేక్ష‌కులు కేరింత‌ల‌తో స్వాగతం ప‌లికేవారు. బావ‌లు స‌య్యా అంటూ ఐటం సాంగ్ ల‌కు మారుపేరుగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మీత జీవితం కూడా అర్ధ‌తరంగ ముగిసిందనే చెప్పాలి. చివ‌రి క్ష‌ణంలో ఆమెకు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆద‌ర‌ణ క‌రువు కావ‌డంతో ఆర్ధికంగా విసిగిపోయి... త‌నువు చాలించారు. ఇక‌ 1992 లో నాటి మెటి న‌టిమ‌ణి దివ్య‌భార‌తి తంతూ కూడా దాదాపుగా అర్దాత‌రంగా త‌నువు చాలించిన‌వారిలోకే వ‌స్తోంది. అయితే ఆమే ప్రేమ విఫ‌ల‌మ‌య్యే కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య కు పాలుప‌డింది. 


దివ్య‌భార‌తి దాదాపుగా  రెండ‌వ త‌రం హీరోలంద‌రితో న‌టించిన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టి గా గుర్తింపును తెచ్చుకుంది. ఇక‌పోతే తాజాగా చిన్న‌త‌నంలో నే ప్రాణాలు తీసుకున్న హీరోలంటే కునాల్, ఉద‌య్ కిర‌ణ్ లు గా చెప్పక త‌ప్పదు.  ప్రేమికుల రోజు సినీమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైన కునాల్... తెలుగు ప్రేక్ష‌కులు గుండెల్లో గూడు కట్టుకున్నాడు. వాలు క‌నులా దానా నీ విలువ తెలుపువ‌మ్మా అంటూ పాట‌లో త‌న‌దైన శైలీలో న‌టించి మెప్పించిన కునాల్ త‌న జీవితాన్ని మాత్రం మెప్పించ‌లేక‌పోయారు. ప్రేమికుల రోజు సినీమా అనంత‌రం ఆయ‌న కు పెద్ద‌గా సినీమాలు రాక‌వ‌పోవ‌డం.. వ‌చ్చినా ఆ సినీమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో ఆర్థికంగా ఇబ్బందుల‌తో  ఎవ్వ‌రికి చెప్పుకోలేక భ‌గ‌వంతుడికే చెప్పుకోవాల‌నుకొని.. ఆర్ధ‌త‌రంగా ఉరివేసుకుని మ‌ర‌ణించి త‌నువు చాలించాడు. ఇక చిత్రం సినీమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అర‌గేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ పరిస్థితి దాదాపుగా అంతే... చిత్రం, నువ్వు నేను సినీమాల‌తో గొప్ప పేరు తెచుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్ ప‌రిస్థితి కూడా అర్ధాంత‌ర‌పు ముగింపు జీవిత‌మేన‌ని చెప్పాలి.


 
తెలుగు ప్రేక్ష‌కుల్లో ల‌వ‌ర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్‌.. చివ‌రి క్ష‌ణంలో సినీమాలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఆర్ధికంగా కృంగి పోయాడు. ఒక వైపు సినీమా రంగంలో ఆద‌ర‌ణ లేకా... మ‌రోవైపు బ‌య‌ట నుంచి తీసుకువ‌చ్చిన అప్పులా బాధ‌లు...ఇంకోవైపు కుటుంబ బాధ్య‌త‌లు ... ఇలా ఒక‌దాని పై ఒక‌టి స‌మ‌స్య‌లు రావడంతో ఇక చావ‌డమే శ‌ర‌ణ్య‌మ‌ని భావించిన ఉద‌య్ కిర‌ణ్ త‌న ఇంటి గ‌దిలో ఉరివేసుకుని చ‌నిపోయారు. ఇక‌పోతే.. ఆర్తి ఆగ‌ర్వాల్ మ‌ర‌ణం కూడా ఈ కోవకు చెందిన‌ది గా చెప్పుకోవ‌చ్చు. ఆర్థిక ఇబ్బందులు, టెన్ష‌న్, అవ‌కాశాల‌లేమీ తో చ‌నిపోయిన వారి సంఖ్య టాలీవుడ్ లో విప‌రీతంగా పెరిగిపోతుంది. ఇక  తాజాగా బ‌ల‌వ‌ర్మ‌ణానికి పాలు ప‌డిన అల‌నాటి న‌టుడు, హీరో, విల‌క్ష‌ణ న‌టుడు రంగనాథ్ మ‌ర‌ణం సైతం దాదాపుగా ఇదే ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని చెప్పాలి. రైల్వే శాఖ లో టికెట్ క‌లెక్ట‌ర్ (టీసీ) గా ప‌నిచేస్తూ సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు రంగ‌నాథ్. 


బుద్దిమంతుడు సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయ‌న 1974 లో చంద‌న అనే చిత్రంలో క‌థ‌నాయ‌కుడిగా వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అయితే ప్రేక్ష‌కుల గుండెల్లో స్థానం సంపాందించి పెట్టింది మాత్రం పంతులమ్మ చిత్ర‌మేన‌ని చెప్పాలి. సుమారుగా 300 పైగా చిత్రాల్లో రంగనాథ్ న‌టించారు. ప‌లు టీవీ సీరియ‌ల్ లోనూ న‌టించారు. మొగుడ్స్ – పెళ్లామ్స్ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు రంగనాథ్. 50 చిత్రాల్లో హీరోగా..  మ‌రో 50 చిత్రాల్లో ప్రతినాయ‌కుడి పాత్ర‌లు పోషించారు. తెలుగు చిత్ర సినిమాలో రెండోత‌రం హీరోలతో రంగ‌నాథ్ క‌లిసి పని చేశారు. సినీమాల అవ‌కాశాలు లేకా.. వ‌య‌సు మీద ప‌డ‌టంతో.. ఒంట‌రిగా జీవ‌నం గ‌డుపుతున్న నేప‌థ్యంలో డిప్రెష‌న్ కు గురై మెడ‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హత్య కు పాలు ప‌డ్డారు రంగ‌నాథ్. అంతేకాకుండా... తాజాగా కోరియోగ్రాఫ‌ర్ భ‌ర‌త్ సైతం ఆర్ధిక ఇబ్బందులు, అవ‌కాశాలు  లేక‌పోవ‌డంతో బ‌ల‌వన్మర‌ణాలు పాలుప‌డ్డారు. ఈ టీవీలో ఆట-2 లో చిన్న‌పిల్ల‌ల‌కు డ్యాన్స్ లోని మెల‌కువ‌ల‌ను నేర్పుతూ ఉండే భ‌ర‌త్ కు గ‌త కొంత కాలంగా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు లేక‌నే చ‌నిపోయారు.


ఇక ఈ అర్థంత‌రంగా ప్రాణాలు తీసుకున్న న‌టులు ఒక్క‌ప్పుడు దాదాపుగా తెలుగు చిత్ర‌సీమ లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లను తెచ్చుకున్నావారే. మ‌రి వీరికి తెలుగు ఇండస్ట్రీలో అవ‌కాశాలు  ఎందుకు రావ‌డంలేదు. మూవీ ఆర్టీస్ట్ ఆసోషియేష‌న్ ఉన్నా.. ఎందుకు ఈ విష‌యం పై సీరియ‌స్ గా తీసుకోవ‌డంలేదన్న ప్ర‌శ్న‌కు స‌మాదానం ఆ సంస్థే చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో ఓ గొప్ప నటుడిని కోల్పోయింద‌ని చ‌నిపోయిన త‌రువాత మీడియా ముందు వచ్చి సంతాపాల‌తో చేతులు దులుపుకునే సినీరంగ పెద్ద‌లు, కొంచెం ముందే ఈ విష‌యం పై దృష్టి పెడితే ఈ సంఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కావు. ఇప్ప‌టికే ఈ విష‌యం ప్రేక్ష‌కుల్లో ఒక ర‌క‌మైన వార్త‌లు బ‌హిర్గ‌తం అవుతున్నాయి. సీనిమా ఇండస్ట్రీ కేవ‌లం కొంత మంది బ‌డా సినీ పెద్ద‌ల చేతుల్లో న‌లిగి పోతుందని...ఈ కారణంగానే చాలా మందికి అవ‌కాశాలు రావ‌డంలో రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌న్న వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా కేవ‌లం కాసుల కోస‌మే సినీమాలు తీసే ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ఈ విష‌యం పై దృష్టి సారించ‌క‌పోతే రానున్న రోజుల్లో వారి సినీమాలకు తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం లేక‌పోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: