పాప్ సంగీత ప్రపంచంలో మైకేల్ జాక్సన్ అంటే తెలియని వారు ఉండరు. చిన్ననాడే  సంగీత ప్రపంచంలో అడుగు పెట్టి ప్రపంచ స్థాయిలో తన గానంతో కోట్ల మందిని అలరించారు. మైకేల్ జాక్సన్ అనుమానాస్పద మృతితో సంగీత ప్రియులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన సోదరి  ప్రముఖ పాప్ సింగర్ జానెట్ జాక్సన్ క్యాన్సర్ సోకిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో తాజాగా ఆమె స్పందించింది. తనకు కేన్సర్ సోకలేదని అవన్నీ వట్టి పుకార్లేనని తెలిపింది.

గతంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు తక్షణం ఆపరేషన్ చేయాలని సూచించారని జానెట్ జాక్సన్ ఫేస్ బుక్ ద్వారా ఆ విషయాన్ని అభిమానులకు తెలిపింది. దీంతో వెంటనే తాను ఇవ్వాల్సిన స్టేజ్ షోలను కూడా రద్దు చేసుకొవడంతో ఆమెకు కేన్సర్ సోకిందని వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన జానెట్ జాక్సన్ తనకు కేన్సర్ సోకలేదని తెలియజేసింది.

ఇక పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత ఆమె  సంగీత ప్రపంచానికి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. రెండేళ్ల తరువాత ప్రదర్శనలివ్వడం ప్రారంభించిన జానెట్, అనారోగ్య కారణంగా ప్రదర్శనలకు మళ్లీ దూరంగా ఉంది. జానెట్ జాక్సన్ ఇవ్వాల్సిన స్టేజ్ షోలను కూడా రద్దు చేసుకొవడంతో ఆమెకు కేన్సర్ సోకిందని వార్తలు గుప్పుమన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: