మొన్నటిదాకా హీరోగా ఫ్యామిలీ లేడీస్ ని అలరించిన జగపతిబాబు అలియాస్ జగ్గు భాయ్.. లెజెండ్ సినిమాతో విలన్ గా మారి ట్రెండ్ క్రియేట్ చేశాడు. బాలకృష్ణకు సరి తగ్గ పోటీగా రంగంలో దిగి సూపర్ హిట్ కొట్టాడు జగ్గు భాయ్. ఇక ఆ సినిమా తర్వాత శ్రీమంతుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ నాన్నగా నటించి తన విలక్షణ నటను చూపించాడు.


ఇక ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో మరోసారి విలన్ గా ప్రత్యక్షమై వారెవా అనిపించాడు. ఇక ఇప్పుడు స్టైలిష్ విలన్ అంటే జగ్గు భాయ్ కు కాల్ ఫర్ చేయాల్సిందే. అయితే తనకు ఇలాంటి రిచ్ క్యారక్టర్స్ చేసి చేసి బోర్ వచ్చింది అంటున్నాడు జగపతి బాబు. విలన్ గా మారాక చేసిన మూడు సినిమాలు చాలా రిచ్ పాత్రలొచ్చాయని క్యారక్టర్స్ నచ్చి అవి చేశా కాని ఇకనుండి రిచ్ పాత్రల కన్నా కాస్త కొత్తరకం పాత్రలు చేయాలనుకుంటున్నా అన్నారు జగ్గు భాయ్. 


ఈరోజు రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్.టి.ఆర్ కు ధీటుగా విలన్ గా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు జగపతిబాబు. కృష్ణమూర్తి క్యారక్టర్ లో నూటికి నూరు శాతం న్యాయం చేసి సినిమాకు హీరో ఎంత ప్రాధాన్యమో విలన్ కూడా అంతే అనుకునేలా చేశాడు. నిన్నటితరం హీరోగా ప్రేక్షకుల్లో ఓ మార్క్ సంపాదించి ఇప్పుడు విలన్ గా కూడా అదిరిపోయేలా చేస్తున్నాడు జగపతి.


మరి జగ్గు భాయ్ చెప్పిన ఈ కొత్తరకం పాత్రలు సృష్టించి తనను ఇంప్రెస్ చేసే కథతో వస్తే ఎలాంటి సినిమానైనా చేస్తా అని అంటున్నారు. విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి చేసిన సినిమాలన్నీ హిట్ కొట్టి కెరియర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటున్నాడు. ఇన్నాళ్ళు సోలో హీరోగా హిట్ కోసం ట్రై చేసి కాస్త వెనుకపడ్డ జగపతిబాబు ప్రస్తుతం కెరియర్ ఫుల్ సాటిస్ ఫైడ్ గా ఉంది అన్నది మాత్రం నిజం. 


మరింత సమాచారం తెలుసుకోండి: