నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య వార్ గా ఈ సంక్రాంతికి విడుదల అయిన బాలకృష్ణ ‘డిక్టేటర్’ పై నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ కలెక్షన్స్ పరంగా మన ఇరు రాష్ట్రాలలోని అన్ని సెంటర్లలోను ముందడుగులో ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్. దీనితో నాగ్ బాలయ్య పై విజయం సాధించాడు అంటూ కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ నాగార్జునుల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపధ్యంలో నాగ్ హరికృష్ణను ఉద్దేసించి తన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు టాక్. 

ఇక వివరాలలోకి వెళితే జూనియర్ అతిధిగా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’  షోలో నాగ్ ఈ కామెంట్ చేసాడు. జూనియర్ కుటుంబంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని నాగార్జున వివరిస్తూ ‘మీ ఫ్యామిలీలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా’ అంటూ ఎన్టీఆర్‌ను అడిగాడు నాగ్‌ ఆ తర్వాత జూనియర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే తనకు జూనియర్ తండ్రి  హరికృష్ణ అంటే విపరీతమైన ఇష్టం అని చెపుతూ తాము ఇద్దరం కలిసి ‘సీతారామరాజు’ సినిమాలో కలిసి నటించాక ఆ బంధం మరింత పెరిగింది అని కామెంట్ చేసాడు నాగార్జున.

అంతేకాదు తాను జీవితంలో ‘అన్న’ అని ఆప్యాయంగా పిలిచేది ఒక్క హరి కృష్ణను మాత్రమే అని చెపుతూ తన అన్నయ్య వెంకట్ ను కూడ అన్న అని పిలవనని పేరుపెట్టి వెంకట్ అని అంటానని అటువంటిది ఒక హరికృష్ణని మాత్రమే తాను ఆప్యాయంగా అన్న అని పిలుస్తానని సంచలన కామెంట్ చేసాడు నాగార్జున. ఈ మాటలకు ఈ షో చూస్తున్నవారికి ఆశ్చర్యంతో పాటుగా నాగ్ హరికృష్ణ ల  మధ్యసాన్నిహిత్యాన్ని  తెలియచేసేలా చేసాయి. 

అయితే ఈ షో చూసిన బాలయ్య అభిమానులు వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. నందమూరి కుంటుంబంలో తనకు హరికృష్ణ మాత్రమే బాగా ఇష్టం అని నాగార్జున ఓపెన్ గా చెప్పిన నేపధ్యంలో నాగ్ కు బాలయ్య పట్ల అంత సాన్నిహిత్యం లేదని మరోసారి అందరికీ గుర్తుకు చేసేలా నాగార్జున కామెంట్స్ ఉన్నాయి అంటూ జూనియర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: