‘గబ్బర్ సింగ్ 2’ లో అనీషా ఆంబ్రోస్ ను హీరోయిన్ గా మొదట్లో ఎంపిక చేసిన తరువాత ఆ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా మారిపోయిన తరువాత ఆమె స్థానంలో కాజల్ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. దీనితో షాక్ అయిన అనీషా తన ప్రయత్నాలు ఆపకుండా వేరే హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం ఆమె యంగ్ హీరో సందీప్ కిషన్ తో ‘మిస్టర్ నూకయ్య’ మూవీ దర్శకుడు కన్నెగంటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. తమిళ మలయాళ భాషల్లో పెద్ద హిట్టయిన ‘నేరం’ కు ఇది రీమేక్. ముందుగా ఈసినిమాకు ‘123’ అనే టైటిల్ అనుకున్నారు. 

అయితే ఆ టైటిల్ నచ్చక పోవడంతో ఈసినిమా స్టోరీ లైన్ ను ఈసినిమా హీరో హీరోయిన్స్ చేత చెప్పిస్తు డానికి అనుగుణంగా ఒక మంచి టైటిల్ ను పెట్టమని ప్రేక్షకులనే డైరెక్ట్ గా అడుగుతున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ అనీషా సందీప్ కిషన్ లపై చిత్రీకరించిన ఒక వీడియోను కూడ విడుదల చేసారు. ఏ మనిషి విజయానికి అయినా పరాజయానికి అయినా కాలమే కారణం అని చెప్పే మూల కథతో ఈ సినిమా తీయబడుతోంది.

అయితే ఈ సినిమా నిర్మాతలు ‘టైటిల్ చెప్పండి బహుమతి కొట్టండి’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో హీరోయిన్ పాత్ర చేస్తున్న అనీషా టైటిల్ గురించి సమస్య ఎందుకు ఈసినిమాకు ‘గబ్బర్ సింగ్ 3’ అనే టైటిల్ పెట్టవచ్చు కదా అని హీరో సందీప్ కిషన్ తో అంటుంది. దానికి సందీప్ ‘ఆశ పడటంలో తప్పులేదు ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్’ అంటాడు. అయితే దీనిని బట్టి చూస్తూ ఉంటే ఎదో ఒకరోజు అనీషా పవన్ తో నటించాలి అన్న కోరిక నుండి ఇంకా బయటపడినట్లు అనిపించడం లేదు. కనీసం ఈమె కోసం అయినా పవన్ ‘గబ్బర్ సింగ్ 3’ తీస్తాడేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: