తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతలకు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ‘ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్' స్థల వివాదానికి సంబందించిన విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.  ఆ పాఠశాల స్థలం చాలా నెలలుగా వివాదంలో ఉంది. వాస్తవానికి జనవరి 27న విచారణకు రజనీ హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. దీంతో తమిళనాడు మెట్రిక్యులేషన్ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ వారికి సమన్లు పంపారు.

అయితే ఈ కేసులో పాఠశాల ప్రిన్స్‌పల్ వందన పేరు జతచేసి ఉంది. ఆమె విచారణకు హాజరవ్వాల్సిన పేరుల్లోంచి రజనీకాంత్ పేరును తీసివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో రజనీకాంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపల్ వందన వేసిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. రజనీకాంత్ హాజరు కావడానికి అవసరమైతే రెండు వారాలు గడువు పెంచుతామని కోర్టు తేల్చి చెప్పంది.

రజినీకాంత్, లత


రజనీకాంత్ హాజరు కావడానికి అవసరమైతే రెండు వారాలు గడువు పెంచుతామని కోర్టు తేల్చి చెప్పంది. వ్యక్తిగత హాజరు నుంచి రజనీకాంత్ కు మినహాయింపు ఇవ్వడం కుదరదని హైరోర్టు ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: