సినిమా అంటేనే రంగుల ప్రపంచం ఇక్కడ అన్నీ అభూత కల్పనలే చూపిస్తారు. ఒక్క హీరో వందమందికి సమాధానం చెబుతాడు..వాళ్లను గాల్లో ఎగిరించి మరీ కొడతాడు. అయితే గతంలో కొన్ని ఫైటింగ్ సీన్లకు డూప్ లను వాడేవారు.  ఈ మద్య హీరోలు కాస్త ధైర్యం చేస్తూ..డూప్స్ లేకుండా ఫైటింగ్ సీన్లలో పాల్గొంటున్నారు..ఆ సమయాల్లో దెబ్బలు కూడా తింటున్నారు. ఏది ఏమైనా అలాంటి సీన్లు వీక్షకులకు సహజంగా అనిపిస్తుంటాయి.

తాజాగా ఓ తమిళ సినిమా షూటింగ్ లో సహజత్వం కోసం ఫైట్ సన్నివేశం చేయాలని చూస్తే.. అది కాస్త సీరియస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..పోక్కిరి రాజా అనే సినిమాలో రంగం ఫేమ్ జీవా హీరోగా నటిస్తున్న చిత్రంలో శిబిరాజ్ మరో పాత్ర వేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు పాత్రలు సమాన స్థాయిలో ఉన్నాయట. ఒక సన్నివేశంలో హీరో జీవాని శిబిరాజ్ కొట్టడంతో జీవా తిరగబడి వెంటనే శిబిరాజ్ చెంప చెల్లుమనిపించాలి..అంతా బాగానే ఉన్న సీన్ లో కాస్త సహజత్వం ఉండాలని దర్శకుడు అనడంతో జీవా నిజంగానే శిబిరాజ్ చెంప చెల్లుమనిపించాడట.

పోక్కిరి రాజా చిత్రంలో శిబిరాజ్,హన్సిక,జీవా


అంతే దాంతో ఇద్దరి మద్య నిజంగానే గొడం జరిగి కొట్టుకునే పరిస్థితికి రావడంతో వెంటనే షూటింగ్ ఆపివేశారట. వాస్తవానికి జీవా,శిబిరాజ్ మంచి స్నేహితులు ఈ సంఘటనతో ఇద్దరి మద్య స్నేహం బెడిసికొట్టిందట..దీంతో వారి మద్య మాటల్లేకుండా పోయాయని చెప్పుకుంటున్నారు. గతంలో కూడా కొన్ని షూటింగ్స్ లో హీరోలకు విలన్ల చేత ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి కానీ అప్పట్లో అవి పెద్దగా బయటకు రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: