మెగా స్టార్ చిరంజీవి సర్జరీ చేయిoచుకున్నట్లుగా వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియకపోయినా మెగా అభిమానులు మాత్రం ఉలిక్కి పడుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ అనంత పురం వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కాంగ్రెస్ నాయకులు అంతా వచ్చినా అక్కడ చిరంజీవి కనిపించక పోవడంతో మెగా స్టార్  ఏమైపోయాడు అంటూ గుసగుసలు వినిపించిన నేపధ్యంలో ఈ వార్త బయటకు వచ్చినట్లు టాక్.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి ముంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పటల్ లో సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అందువల్లనే చిరంజీవి నిన్న జరిగిన రాహుల్ గాంధీ అనంతపురం టూర్ లో కనిపించక పోవడమే కాకుండా నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓటు వేయడానికి సందడి చేయలేదని టాక్. 

చిరంజీవికి తన భుజానికి సంబంధించి ఏర్పడిన ఆరోగ్య సమస్యకు ఈ సర్జరీ చేయించు కున్నట్లు తెలుస్తోంది. వైద్యులు సలహా మేరకు దాదాపు ఒక వారం విశ్రాంతి తరువాత చిరంజీవి ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ కు తిరిగి వస్తాడని తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా చిన్నచిన్న సమస్యలు ఎన్ని ఎదురైనా ‘కత్తి’ రీమేక్ విషయంలో చిరంజీవి స్థిర నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

‘కత్తి’ ఒరిజనల్  స్టోరీ తనదే అంటూ రచయిత నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు విషయమై ఒక పరిష్కారం వెతకడానికి మార్గం అన్వేషించ వలసిందిగా రచయితలు పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలో లభిస్తే వెంటనే ‘కత్తి’ రీమేక్ షూటింగ్ ను ప్రారంభించాలని చిరంజీవి చాల గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవికి జరిగిన ఈ సర్జరీ వల్ల ‘కత్తి’ రీమేక్ షూటింగ్ ప్రారంభం మరి కొద్ది కాలం ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: