పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ లుగా మారుతున్నాయి. పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల కాకుండానే పవన్ ఈ సినిమా తరువాత నటించబోయే సినిమాల ఎంపిక విషయంలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతున్నాయి. గత రెండు రోజులుగా పవన్ అజిత్ నటించిన ‘వేదాళం’ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు వచ్చి 48 గంటలు గడవ కుండానే ఈసినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెడుతున్నాడు అనే వార్తలు మరింత షాకింగ్ న్యూస్ గా మారాయి. 

రెండు సంవత్సరాల క్రితం జూనియర్ తో ‘రభస’ సినిమా తీసి ఘోరమైన ఫ్లాప్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ వైపు పవన్ చూడటం పవన్ అభిమానులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. అయితే ఈ నిర్ణయం వెనుక పవన్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం పవన్ కలం చేతబట్టి కథా కధనం అన్నీ తానై సమకూర్చిన నేపధ్యంలో పవన్ విపరీతమైన టెన్షన్ పడినట్లు టాక్. 

ఇప్పుడు ఆ పని ఒత్తిడి నుండి బయట పడటానికి పవన్ దృష్టి రీమేక్ లపై పడింది అని అంటున్నారు. గతంలో టాలీవుడ్ లో వచ్చిన చాల రీమేక్స్ హిట్ అయిన సందర్భంలో ‘వేదాళం’ కథ విషయంలో కూడ రీమేక్ అయితే కథ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని పవన్ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పవన్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇటువంటి రీమేక్ ను ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ చేతోలో పవన్ ఎందుకు పెట్టాడు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. 

అయితే ఈసినిమాను ఎస్ జె సూర్య పవన్ తో తీయబోతున్న సినిమా ముందు చేస్తాడా లేకుంటే అటు దర్శకుడు సూర్య సినిమాను మరోవైపు సంతోష్ శ్రీనివాస్ సినిమాను ఒకేసారి రెండు వైపులా నడిపించి తన అభిమానులకు షాక్ ఇస్తాడా అన్న అనుమానాలు కూడ ఉన్నాయి. మొన్న హైదరాబాద్ వచ్చి కాపు గర్జన పై ప్రెస్ మీట్ పెట్టిన పవన్ తన సమయాన్ని మరింత వృథ చేసుకోకుండా తిరిగి ‘సర్దార్’ షూటింగ్ లో పాల్గొనడానికి నిన్న మళ్ళీ కేరళ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఏమైనా పవన్ నిర్ణయాలు ఎవ్వరికీ అర్ధం కాని పజిల్స్ గా మారుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: