విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు వారసుడు పుట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ తన ట్విటర్ లో షేర్ చేస్తూ తన ఆనందానికి అవధులు లేవు అంటూ కామెంట్స్ చేసాడు. ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. 

వీరిద్దరికీ ఈరోజు ఉదయం ఒక పండంటి బాబు పుట్టినట్లు ప్రకాష్ రాజ్ తెలియచేయడంతో అతడి సన్నిహితులు ప్రకాష్ రాజ్ ను ఈరోజు ఉదయం నుంచి అభినందిస్తూ తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత పోనీ వర్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. 

మొదట్లో చెన్నైలో ఉండే ప్రకాష్ రాజ్ పోనీ వర్మను పెళ్ళి చేసుకున్న తరువాత తన మకాంను హైదరాబాద్ కు మార్చడమే కాకుండా ఇక్కడ ఒక భారీ వ్యవసాయ క్షేత్రాన్ని కొని ఊరికి చివర ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు.  ప్రకాష్ రాజ్ కు తన మొదటి భార్యతో కలిసి ఉన్న రోజులలో మేఘనా, పూజ అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఇప్పుడు కొడుకు పుట్టడంతో ప్రకాష్ రాజ్ కు వంశోద్ధారకుడు వచ్చాడు అనుకోవాలి. 

దాదాపు 200 సినిమాలలో నటించిన ప్రకాష్ రాజ్ మన దక్షిణాది సినిమా రంగంలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడ నటించి మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ప్రతిభాశాలి. కన్నడ నాటక రంగం నుండి వచ్చి టాప్ ఫిలిం ఆర్టిస్టుగా మారినా ఇప్పటికీ ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడ్డు బెంగుళూరులో తన గురువు గిరీష్ కర్నాడ్ తో కలిసి నాటకాలు వేస్తూ ఉంటాడు అంటే ప్రకాష్ రాజ్ కు నటన అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: