ఈ సంవత్సరం మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చే సంవత్సరంగానే కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా దూరం జరిగిన చిరంజీవి పవన్ లు దగ్గర అవుతున్న సంకేతాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే అభిమానులను ఊరిస్తున్న చిరంజీవి 150వ సినిమా ప్రారంభం త్వరలో కాబోతోంది. ఈ ఆనందాలకు తోడు మెగా కుటుంబంలో త్వరలో పెళ్ళి భాజాలు మోగబోతున్న సంకేతాలు కూడ కనిపిస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు పెళ్ళి నిశ్చయం అయినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈమధ్యనే శ్రీజ విదేశాలలో బిజినెస్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన డిగ్రీని కూడ పూర్తి చేసింది. శ్రీజ ఈమధ్య బెల్లీ డాన్స్ కోర్సులను కూడ నేర్చుకోవడంతో శ్రీజ కూడ తన తండ్రిలాగే సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎదో ఒక రోజు కొరియోగ్రాఫర్ అవుతుంది అనుకున్నారు అంతా.

అయితే అన్ని అంచనాలు తలక్రిందులు చేస్తూ చిరంజీవి శ్రీజకు పెళ్ళి నిశ్చయించినట్లుగా గాసిప్పులు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అత్యంత గోప్యంగా ఈపెళ్ళి వార్తను మెగా కుటుంబం ఉంచుతోంది అని అంటున్నారు. 

అమెరికాలో పలు వ్యాపారాలు చేస్తున్న ఒక ఉన్నత బిజినెస్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యాపార వేత్త కుమారుడుతో శ్రీజ వివాహం నిశ్చయం అయింది అని టాక్. ఇప్పటికే  ఎంగేజ్‌ మెంట్‌ కూడా పూర్తి అయింది అని అంటున్నారు. ఈ సంవత్సరమే వీరిద్దరి వివాహాన్ని జరిపించడానికి చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చినట్లు  ఫిలింనగర్ టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: