ఈసంవత్సరం సంక్రాంతి రేస్ ఏవిదంగా సంచలనం గా మారిందో రాబోతున్న సమ్మర్ రేస్ కుడా మరింత సంచలనంగా మారబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలు రాబోతున్న ఏప్రిల్ మే నెలలలో విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు వెంకటేష్ మారుతీల ‘బాబు బంగారం’ కూడ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేయబోతోంది.

ఈ భారీ సినిమాలతో పాటుగా నితిన్ త్రివిక్రమ్ ‘అ ఆ’ నాగచైతన్య ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’ ఇదే సమ్మర్ రేసును దృష్టిలో పెట్టుకుని సమ్మర్ కు హడావిడి చేయబోతున్నాయి. పవన్ మహేష్ బన్నీల భారీ సినిమాలతో పాటుగా ఇదే సమ్మర్ రేస్ కు వస్తున్న ‘అ ఆ’, ‘బాబు బంగారం’, ‘మజ్ను’ సినిమాల నైజామ్ హక్కులను దిల్ రాజ్ తీసుకోవడం మహేష్ పవన్ లను ఆశ్చర్య పరుస్తోంది అని టాక్.

ఈ సంక్రాంతికి ఎన్ని భారీ సినిమాలు వచ్చినా ‘ఎక్స్ ప్రెస్ రాజ’ ఊహించని ఘన విజయం సాధించిన నేపధ్యంలో అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ కు విడుదల అవుతున్న భారీ సినిమాలను కాదనుకుని దిల్ రాజ్ ఒక మూడు చిన్న సినిమాలు కొనడంతో మళ్ళీ సమ్మర్ రేస్ కు రాబోతున్న టాప్ హీరోల భారీ సినిమాలకు సంక్రాంతిలాగే ధియేటర్ సమస్యలు ఏర్పదతాయా ? అన్న అనుమానాలు ఫిలింనగర్ లో వ్యక్తo అవుతున్నాయి. 

ఎన్నో భారీ అంచనాలు ఉన్న పవన్ మహేష్ ల సినిమాల పై ఆ శక్తి కనపరచకుండా దిల్ రాజ్ సమ్మర్ రేస్ కు వస్తున్న చిన్న సినిమాలు అన్నింటిని టార్గెట్ చేయడంతో పవన్ మహేష్ లకు చెక్ పెట్టే వ్యూహాత్మక ఎత్తుగడ దిల్ రాజ్ వేశాడా ? అనే అనుమానాలు ఫిలింనగర్ లో వ్యక్తమవుతున్నాయి. రాబోతున్న సమ్మర్ రేస్ కు దిల్ రాజ్  తీసుకున్న  నిర్ణయం అప్పుడే హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: