హీరో నాని పై నoదమురి బాలకృష్ణ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం నాని నటిస్తున్న ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని బాలకృష్ణ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ‘జై బాలయ్యా’ అంటూ నాని ఈ సినిమాలోని తన పాత్ర గెటప్ కు పచ్చబొట్టు కూడ వేయించుకున్న సందర్భం ఉంది.

వాస్తవంగా ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అన్న టైటిల్ పెడతారు అన్న ప్రచారం జరిగి చివరిలో ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ గా మారిపోయింది. హనూ రాఘవ పూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విడుదల చేయబడ్డ ట్రైలర్ డైలాగ్స్ లో కూడ ఎక్కడా బాలయ్య ప్రస్తావన కనిపించదు. అటువంటప్పుడు ‘జై బాలయ్యా’ అంటూ ఈ సినిమాకు ముందుగా ఎందుకు ప్రచారం చేసారు అంటూ బాలకృష్ణ అభిమానులు నాని పై కోపంగా ఉన్నట్లు టాక్.

ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా ఇప్పటికీ మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉన్న బాలకృష్ణ ఇమేజ్ ని ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో కాని ప్రమోషన్ లో కాని వాడకుండా బాలయ్య ఇమేజ్ ని కేవలం నాని చేతి పై పచ్చ బొట్టు వరకే పరిమితం చేయడం బాలకృష్ణ అభిమానులకు అర్ధం కాని విషయంగా మారింది అని టాక్. ఈ అసహనంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ను ప్రచారం చేస్తారా అనే సందేహాన్ని కూడ కొంతమంది వ్యక్త పరుస్తున్నారు. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో నాని పాత్ర బాలకృష్ణ వీరాభిమాని అయినప్పటికీ కేవలం బాలయ్యను మాత్రమే ఫోకస్ చేస్తూ ఈసినిమాను ప్రమోట్ చేస్తే హీరోగా ఎదుగుతున్న నాని కెరియర్ కు అది మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఈసినిమా ప్రమోషన్ లో బాలయ్య పై ఫోకస్ తగ్గించి ఉంటారు అన్న సందేహాలు కూడ కొందరు వ్యక్త పరుస్తున్నారు. అయితే బాలయ్య అభిమానుల అసహనం నానీదృష్టి వరకు వెళితే వచ్చే వారం విడుదల కాబోతున్న ఈసినిమా ప్రమోషన్ లో బాలకృష్ణ ప్రస్తావన వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: