ఏపీ రాజకీయాలలో కులాల ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ దేశం లో రాజకీయాలు మొదలు అయ్యిందీ , నడుస్తోందీ కూడా కులం గోడల నుంచే. అప్పుడప్పుడూ మీడియా లో వీటి మీద చర్చ వస్తూ ఉంటున్నది కూడా. అయితే ఫేస్ బుక్ లాంటి సామాజిక అనుసంధాన వెబ్సైటు లలో ఎవరి గ్రూపుల గోలలో పడి వారు పక్కన కులం విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు .

 

 

ఇప్పుడు రాం గోపాల్ వర్మ పుణ్యమా అని ట్విట్టర్ లో కూడా ఈ కులం గోల పాకుతున్నట్టు కనిపిస్తోంది. వంగవీటి రంగా మీద రామూ సినిమా తీస్తాను అని ప్రకటించాడు అది ఎంతవరకూ జరుగుతుంది అనే విషయం పక్కన పెడితే కమ్మ , కాపు కులాల గురించి ట్విట్టర్ లో ప్రస్తావన తీసుకురావడమే కాక వారిద్దరి గురించీ చర్చ జరిగే విషయం లో రామూ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఇప్పటి వరకూ కేవలం గుంటూరు , కృష్ణా , ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో మాత్రమే కాపులకీ - కమ్మలకీ మధ్యన వైరుధ్యం ఉండేది కానీ దాన్ని వర్మ తన తెలివి తేటలతో తన సినిమా కోసం ప్రచారం కలిపిస్తున్నాడు.

 

 

అది కూడా ఏ లెవెల్ కు అంటే, కమ్మవారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కాపే నిజమైన కాపు అంటూ ట్వీట్ చేసేవరకు. కమ్మ వారికి ఇది చాలా తేడాగా కొట్టే ట్వీట్ అని చెప్పాలి. కమ్మ కులస్థులని నమ్మద్దు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతునట్టు ఉన్నాడు వర్మ. వంగవీటి రంగా గా తాను తీసుకున్న ఒక వ్యక్తి ఫస్ట్ లుక్ లు ట్విట్టర్ లో పెట్టి మంచి రసవత్తర సినిమా నడుపుతున్నాడు రామూ అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: