జూనియర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గవ వారంలోకి అడుగు పెడుతోంది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ మన ఇరు రాష్ట్రాలలోని అన్ని సెంటర్లలోను పూర్తిగా తగ్గి పోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు చాల సెంటర్లలో వస్తున్న కలెక్షన్స్ ధియేటర్ ఖర్చులకు సరిపోయే మాత్రంగానే ఉన్నాయి అని ఇక భవిష్యత్ లో ఈసినిమా కలక్షన్స్ వల్ల బయ్యర్లకు కలిసి వచ్చేది ఏమి లేదని అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈసినిమాలో నటించడం వల్ల జూనియర్ కు 50 కోట్ల మార్క్ ను దాటాను అన్న సంతృప్తి మినహా ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లకు మన ఇరు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో ఎంతో కొంత లాస్ వస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న నైజాం బయ్యర్లకు గట్టి నష్టమే వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. 

కోస్తా జిల్లాలలోని ఒక తూర్పు గోదావరి జిల్లా మినహా కోస్తా జిల్లాలలో ఈసినిమాను భారీ మొత్తాలకు కొనుకున్న బయ్యర్లకు కనీసం బ్రేక్ ఈవెన్ కూడ రాలేదు అని తెలుస్తోంది. ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు అందరూ నష్టపోకుండా బత్యత పడాలి అంటే ఈ సినిమా 54 కోట్ల షేర్ ను కలక్ట్ చేయాలని అయితే అటువంటి పరిస్థుతులు ప్రస్తుతం కనిపించడం లేదని టాలీవుడ్ సినిమా కలక్షన్ పండితులు చెపుతున్నారు. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఎంతో పబ్లిసిటీ ఇచ్చి మరెంతో ప్రమోట్ చేసినా ఈసినిమా జూనియర్ కు కేవలం ఒక గౌరవ ప్రదమైన ఫ్లాప్ గా మాత్రమే మిగిలి పోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నటుడుగా జూనియర్ స్థాయిని పెంచిన ఈ సినిమా కలక్షన్స్ పరంగా జూనియర్ కోరుకున్న రికార్డులను అందుకోలేక పోవడం జూనియర్ బయటపడి చెప్పుకోలేని షాక్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: