గత కొద్ది రోజులుగా పొలిటికల్ హాట్ టాపిక్ ఏమిటంటే అదే కాపు సామాజిక వర్గ రిజర్వేషన్. ఈ విషయంపై ఆంధ్రపదేశ్ లో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి వంగవీటి రంగా పేరు ప్రధానంగా పైకి వినిపిస్తుంది. ఇక వంగవీటి రంగాకి అన్యాయం చేసిన వారిలో చంద్రబాబు కీలక వ్యక్తి అనేది కొందరి ప్రధానమైన అభియోగం. ఇటువంటి సమయంలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’పేరుతో మరో సంచలనాత్మక సినిమాకు శ్రీకారం చుట్టాడు.


వ్యక్తిగత జీవిత కథలను సినిమా రూపంలో తెరకెక్కించటం ఒక్క వర్మకి మాత్రం సాధ్యం. ఆ విధంగానే తాజాగా వీరప్పన్‌తో దర్శకుడిగా తన బ్రాండ్‌ను చూపించాడు.ఇప్పుడు వంగవీటి రాధా, ఆయన తమ్ముడు వంగవీటి రంగాల చరిత్రను ‘వంగవీటి’ అన్న టైటిల్‌తో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడంట. మరి వీరి చరిత్రని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే…చంద్రబాబు నిజస్వరూపంని వర్మ బయటపడతాడా? అనే డౌట్ అందరిలోనూ వినిపిస్తుంది.


విజయవాడ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వంగవీటి రంగా, శక్తిగా మారుతున్న సమయంలోనే వ్యక్తిని సమూలం చేశారు. ఈ కథని వర్మ ఏవిధంగా చూపించనున్నాడు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. నిజాలు చెప్పి వర్మ, బాబు ఆగ్రహానికి గురవుతాడా? లేక నిజాలు దాచి సినిమాలో ఉన్న ఆసక్తికరమైన పాయింట్ ని సీక్రెట్ గానే ఉంచుతాడా? అనేది ఇప్పుడు చరిత్ర తెలిసిన వ్యక్తులు ఆసక్తిగా చూస్తున్నారు.


తాజాగా వంగవీటి రాధా పాత్రలో నటించనున్న వ్యక్తి స్టిల్స్‌ ను వర్మ విడుదల చేయటంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే వంగవీటి రంగ గురించి రాధా తనకు చాలా విషయాలు చెప్పారని, ఈ కథను తాను చెప్పే కోణం చాలా కొత్తగా ఉంటుందని వర్మ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: