టాప్ యంగ్ హీరోల హవా నడుస్తున్న నేపధ్యంలో బాలకృష్ణకు మళ్ళీ ఒక టాప్ హీరో ఇమేజ్ తీసుకు వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అనే విషయం ఎవరు కాదనలేని నిజం. ‘సింహ’, ‘లెజెండ్’  సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో రాకుండా ఉండిఉంటే ఈపాటికి ఈతరం ప్రేక్షకులు బాలకృష్ణను మరిచిపోయి ఉండేవారు అన్నదివాస్తవం. బోయపాటి కూడ బాలయ్య అంటే విపరీతమైన అభిమానాన్ని చూపెడుతూ బాలకృష్ణను నందమూరి అభిమానులు ఎలా కోరుకుంటారో అలా చూపించడంతో బాలయ్యకు కూడ బోయపాటి అంటే ప్రత్యేకమైన అభిమానం. 

ఈపరిస్థుతులలో బాలకృష్ణ తన దూకుడు స్వభావంతో చేసిన చిన్న కామెంట్ వీరిద్దరి మధ్య ఈమధ్య గ్యాప్ ను పెంచుతోంది అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే బాలకృష్ణ తన 100వ సినిమాగా ‘ఆదిత్యా 999’ మూవీని చేయడానికి మానసికంగా సిద్ధపడుతున్నప్పటికీ ఈసినిమా ప్రారంభం అయ్యేలోపు బోయపాటి ఏదైనా ఒక పవర్ ఫుల్ స్టోరీతో ముందుకు వస్తే ‘ఆదిత్యా 999’ వెనక్కు జరిపి బోయపాటి స్క్రిప్ట్ కు ఓకె చెప్పాలని బాలకృష్ణ మనసులోని ఆలోచన అని టాక్. 

ఈపరిస్థుతులు ఇలాఉండగా ఈమధ్య బాలకృష్ణముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసినపుడు తన 100వ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు దర్శకుడు సింగీతం దర్శకత్వంలో వుంటుందని ‘ఆదిత్య 999’ అని యధాలాపంగా అనేసాడు అని టాక్. కానీ ఒకవైపు  బాలయ్య 100వ సినిమాకు ఇంకా పూర్తిగా బాలకృష్ణ పరిపూర్ణంగా సిద్ధపడలేదు అని  కొందరు బాలయ్య సన్నిహితులు బోయపాటితో చెపుతూ మంచి కథ తయారు చేయమని తనకు చెపుతూ ఉంటే బాలయ్య ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేసారు అని బోయపాటి తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నాడని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఒకవైపు బాలయ్య 100వ సినిమాకు తనే రైట్ ఆప్షన్ అని అందరూ సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో బాలయ్య నోటివెంట వేరే డైరెక్టర్ పేరు రావడంతో బోయపాటి బాలయ్యల మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. అయితే  గ్యాప్ ను తొలిగించి ఎదోవిధంగా బోయపాటి చేత మంచి కథ రాయించి బాలయ్య 100వ సినిమాను ఒక సంచలనంగా మార్చాలని బాలకృష్ణ సన్నిహితులు కొందరు బోయపాటితో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. అయితే బోయపాటి బెల్లంకొండ శ్రీను సినిమాను చేయవలసిన నేపధ్యంలో ఈ ప్రయత్నాల నుండి బోయపాటిని ఆపు చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి అని ఫిలింనగర్ గాసిప్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: