ప్రపంచంలో హాలీవుడ్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. అందులోనూ స్పీల్ బర్గ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భారీ బడ్జెట్ తో  నిర్మించే ఈయన చిత్రాలు చాలా వరకు ప్రపంచ స్థాయిలో రికార్డులు నెలకొల్పాయి..ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలిచాయి. అలాంటి  స్పీల్ బర్గ్ డైరెక్షన్లో చాన్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారు బాలీవుడ్ నటుడు. వాస్తవానికి పెద్ద పేరున్న హీరో కూడా కాదు..అయినా తనకు వచ్చిన అమూల్యమైన చాన్స్ వదిలేసిన ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..! ఆయనే ఇర్ఫాన్ ఖాన్. 

గతంలో చిన్నా చితకా వేషాలు వేస్తూ అనుకోకుండా హీరో అయిన ఇర్ఫాన్ ఖాన్ కి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగులో మహేష్ బాబు నటించిన ‘సైనికుడు’ చిత్రంలో కూడా విలన్ గా మెప్పించాడు.  ఇక స్టీఫెన్ స్పీల్ బర్గ్ స్వయంగా తన సినిమాలో నటించాలంటూ కోరినా.. సున్నితంగా తిరస్కరించాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.

 బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్


ఇప్పటికే హాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఇర్ఫాన్ తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేని కారణంగానే ఆ పాత్రను తిరస్కరించానని ప్రకటించాడు. హాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడు మంచి కళాకారుల కోసం వెతుకుతూనే ఉంటుంది. అందుకే మంచి కథలతో భారతీయ నటులవైపు చూస్తున్నారు హాలీవుడ్ దర్శకనిర్మాతలు’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: